Navya Swamy: అదొక చేదు అనుభవం.. ఇప్పటికి మా నాన్న నా సీరియల్స్ చూడరు: నవ్య స్వామి

Navya Swamy

Navya Swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తూ తన నటనకు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

  • Share this:
    Navya Swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తూ తన నటనకు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.కన్నడ సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయం అయిన నవ్య స్వామి ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది. అంతేకాకుండా తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది.

    నా పేరు మీనాక్షి సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. స్టార్ మా లో ఆమె కథ సీరియల్ లో కూడా నటించగా ఆ సీరియల్ అతి తక్కువ సమయంలో ముగిసింది. ఇక ఆమె కథ సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో బాగా సన్నిహితంగా ఉండటంతో.. వారి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు పుకార్లు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్నది. అంతే కాకుండా తనతో పాటు మరో బుల్లితెర నటి శ్రీ వాణి కూడా పాల్గొనగా.. అందులో తమ వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. నవ్య స్వామి తనకు ఎదురైన చేదు సంఘటనలు గురించి కూడా పంచుకుంది.

    ఇక ఈ బ్యూటీ ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా.. అందులో తను నటిగా కాక ముందుకు తమ కుటుంబం ఆర్థికంగా బాగా ఇబ్బంది పడిన విషయాన్ని పంచుకుంది. తను మెడిసిన్ చేద్దామనుకున్న సమయంలో ఒక పత్రికా ప్రకటన ద్వారా బుల్లితెర లో పరిచయమైందట. ఇక తాను ఓ వ్యక్తితో ప్రేమలో విఫలం కాగా.. అదొక చేదు అనుభవం అంటూ తెలిపింది.

    ఇదిలా ఉంటే తను నటించే సీరియల్స్ ను తన నాన్న ఇప్పటికీ చూడరని తెలిపింది. ఇక తన సోదరుడు తను ఏడవని సీరియల్ ఏదైనా ఉంటే చెప్పు చూస్తానని అన్నాడట. తన తల్లి తన మేకప్, తన నటనని చూసి బాగా కామెంట్ చేస్తుందట. ఇక సినిమాల్లో అవకాశాలు రాగా డేట్స్ కుదరక వదులుకుందట. కానీ భవిష్యత్తులో వెండితెరపై నటించాలనే కోరిక ఉందని తెలిపింది నవ్య స్వామి.
    Published by:Navya Reddy
    First published: