HOME »NEWS »MOVIE »telugu senior top hero victory venkatesh follows nagarjuna balakrishna chiranjeevi in this way ta

Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh: చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున రూట్లో వెంకటేష్.. ఇంతకీ ఏ విషయంలో అంటే..

Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh: చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున రూట్లో వెంకటేష్.. ఇంతకీ ఏ విషయంలో అంటే..
చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ (File/Photo)

Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh | అవును..ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఆ పని కానిచ్చేసారు..ఇపుడు వెంకటేష్ ఆ పని చేయాలా వద్దా అని ఆలోచించాడు. కానీ ఇపుడు ఈయన కూడా రంగంలోకి దిగిపోయాడు.  వివరాల్లోకి వెళ్లితే..

  • Share this:
    Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh | అవును..ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఆ పని కానిచ్చేసారు..ఇపుడు వెంకటేష్ ఆ పని చేయాలా వద్దా అని ఆలోచించాడు. కానీ ఇపుడు ఈయన కూడా రంగంలోకి దిగిపోయాడు.  వివరాల్లోకి వెళ్లితే.. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు తమ సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీసే పనిలో పడ్డారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి,..శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు చేసాడు. అందులో ఎంబీబీఎస్ హిట్టైయితే...జిందాబాద్ మాత్రం ఆడియన్స్‌తో జిందాబాద్ కొట్టించుకోలేకపోయింది. తాజాగా ఓ దర్శకుడు చిరంజీవి నటించిన ఓ పాత సూపర్ హిట్ సినిమా సీక్వెల్ స్టోరీ అంటూ చిరంజీవి దగ్గరకు వస్తే.. ఆయన మాత్రం సున్నితంగా అలాంటి ప్రయోగాలు చేయడం కంటే సైలెంట్‌గా ఉండటం మేలని ఆ దర్శకుడి ఆలోచనలను మొగ్గలోనే తుంచేసాడు. ఒకవేళ తన పాత సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్ చేయాలనుకుంటే.. తన ఫ్యామిలీలో ఉన్న మెగా హీరోలను సంప్రదించమని సలహా ఇచ్చాడట.

    Venkatesh Super Hit Movie Gharshana Sequel On Cards,Pulwama, India, Kashmir అవును..ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ పని కానిచ్చేసారు..ఇపుడు నాగార్జున అదే పని మీదున్నాడు. ఇక వెంకేటేష్ కూడా అదే పని చేయాలని ఫిక్స్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే..Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh, Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh doing Sequels, Venkatesh Gharshana Sequel, chiru balaiah nag venky, Tollywood Senior Heroes Chiranjeevi Balakirshna Nagarjuna venkatesh, Mega star Chiranjeevi, Balakrishna, Chiru, Balayya, NBK, Nagarjuna, Venkatesh, Tollywood News, Telugu cinema News, Telugu News, చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్, చిరు బాలయ్య నాగ్ వెంకీ, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, బాలయ్య, నాగార్జున, నాగ్, వెంకటేష్, వెంకీ ఘర్షణ సీక్వెల్, పట్టాలెక్కనున్న వెంకటేష్ గౌతమ్ మీనన్ ఘర్షణ సీక్వెల్, తెలుగు సినిమా న్యూస్, టాలీవుడ్ న్యూస్
    శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్




    ఇక నందమూరి నట సింహం కూడా తన తండ్రి బయోపిక్‌ను రెండుభాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ గా విడులైంది. రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ గా విడుదలైంది. ఐతే.. ఈ రెండు చిత్రాలు సీక్వెల్స్ కాదు. ఒకే సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు. తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై తెరెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్స్‌ బాలకృష్ణకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.  మరోవైపు బాలయ్య తన పాత సూపర్ హిట్ ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. అది ఎపుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

    Venkatesh Super Hit Movie Gharshana Sequel On Cards,Pulwama, India, Kashmir అవును..ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ పని కానిచ్చేసారు..ఇపుడు నాగార్జున అదే పని మీదున్నాడు. ఇక వెంకేటేష్ కూడా అదే పని చేయాలని ఫిక్స్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే..Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh, Tollywood Senior Heroes Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh doing Sequels, Venkatesh Gharshana Sequel, chiru balaiah nag venky, Tollywood Senior Heroes Chiranjeevi Balakirshna Nagarjuna venkatesh, Mega star Chiranjeevi, Balakrishna, Chiru, Balayya, NBK, Nagarjuna, Venkatesh, Tollywood News, Telugu cinema News, Telugu News, చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్, చిరు బాలయ్య నాగ్ వెంకీ, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, బాలయ్య, నాగార్జున, నాగ్, వెంకటేష్, వెంకీ ఘర్షణ సీక్వెల్, పట్టాలెక్కనున్న వెంకటేష్ గౌతమ్ మీనన్ ఘర్షణ సీక్వెల్, తెలుగు సినిమా న్యూస్, టాలీవుడ్ న్యూస్
    ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’


    ఇంకోవైపు కింగ్ నాగార్జున కూడా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మరోవైపు ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ సినిమాను చేసాడు. కానీ ఈ సినిమా నాగార్జున కెరీర్‌లోనే డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఇక త్వరలో తెరకెక్కబోయే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున.

    "Venkatesh
    నాగార్జున, రమ్యకృష్ణ (File/Photo)


    తాజాగా సీక్వెల్ సినిమాలు చేయబోతున్న హీరోల జాబితాలో వెంకటేష్ కూడా జాయిన్ అయ్యాడు. ఈయన తాజాగా ’ఎఫ్ 2’ మూవీకి సీక్వెల్ ప్రకటించాడు. ఈ సినిమాకు ఎఫ్ 3 అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రటకించారు. ఎఫ్ 2లో యాక్ట్ చేసిన నటీనటులే మరోసారి ఈ సీక్వెల్‌లో సందడి చేయనున్నారు. మరోవైపు ఇందులో స్టార్ హీరో, హీరోయిన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నట్టు దర్శకులు అనిల్ రావిపూడి చెప్పాడు.

    HBD Venkatesh Varun Tej Anil ravipudi Dil Raju F2 Sequel F3 Movie Official Announcement first look Poster Released HBD Venkatesh: F3 మూవీపై అఫీషియల్ ప్రకటన.. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల..
    వరుణ్‌తేజ్‌తో F3 మూవీ చేస్తోన్న వెంకటేష్ (Twitter/Photo)


    మరోవైపు వెంకటేష్  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘ఘర్షణ’ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.తమిళంలో సూర్య హీరోగా ‘కాకా కాకా’ సీక్వెల్‌గా ‘కాకా కాకా 2’ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు. మరి తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్నాడు కాబట్టి..తెలుగులో ఈ సినిమాను డబ్ చేసే అవకాశాలున్నాయి. కానీ రానా మాత్రం ఈ సినిమాను బాబాయి వెంకటేష్‌తో సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే గౌతమ్ మీననన్‌తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అంతేకాదు ఈ సీక్వెల్‌లో  వెంకటేష్‌తో పాటు రానా కూడా యాక్ట్ చేయాలనుకున్నట్టు సమాచారం.

    తాజాగా సీక్వెల్ సినిమాలు చేయబోతున్న హీరోల జాబితాలో వెంకటేష్ కూడా జాయిన్ అవుతున్నాడు. ఈయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘ఘర్షణ’ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తమిళంలో సూర్య హీరోగా ‘కాకా కాకా’ సీక్వెల్‌గా ‘కాకా కాకా 2’ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు. మరి తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్నాడు కాబట్టి..తెలుగులో ఈ సినిమాను డబ్ చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ వెంకటేష్‌కు ఈ కథ నచ్చితే తెలుగులో ఈ సీక్వెల్ తెరకెక్కే అవకాశాలున్నాయి.
    ‘ఘర్షణ’ మూవీలో వెంకటేష్ (File/Photo)


    ‘ఘర్షణ’  సీక్వెల్ చేయాలనే ఆలోచన గౌతమ్ మీనన్‌కు ఉన్నట్టు ఆల్రెడీ ఎపుడో చెప్పాడు. ఇక తమిళంలో ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా సూర్యకు తెలుగులో రాను రాను మార్కెట్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ’ఘర్షణ’ మూవీ సీక్వెల్‌ను తెలుగులో వెంకటేష్‌,రానాలతో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడట. ఇక తమిళంలో మాత్రం సూర్యతో పాటు ఆయన తమ్ముడు కార్తి నటించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా వెంకటేష్ కూడా తన పాత సినిమాలకు సీక్వెల్ చేసే పనిలో పడ్డాడన్న మాట. గతంలో వెంకటేష్.. రజినీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా తెలుగులో ‘నాగవల్లి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:December 23, 2020, 14:38 IST

    टॉप स्टोरीज