సంగీత దర్శకుడు కోటీ పోలీస్ అవతారం.. ఏ సినిమా కోసమో తెలుసా..

సినిమా ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పనిచేసేవారు నటులుగా తమ సత్తా చూపెడుతూనే ఉన్నారు. తాజాగా తన సుస్వరాలతో శ్రోతలను మైమరిపించిన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తాజాగా నటుడిగా ముఖానికి రంగేసుకొని సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అయ్యారు.

news18-telugu
Updated: September 13, 2019, 10:37 AM IST
సంగీత దర్శకుడు కోటీ పోలీస్ అవతారం.. ఏ సినిమా కోసమో తెలుసా..
వ్యాస్ ఐపీఎస్ పాత్రలో సంగీత దర్శకుడు కోటి (Twitter/Photo)
  • Share this:
సినిమా ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పనిచేసేవారు నటులుగా తమ సత్తా చూపెడుతూనే ఉన్నారు. తాజాగా తన సుస్వరాలతో శ్రోతలను మైమరిపించిన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తాజాగా నటుడిగా ముఖానికి రంగేసుకొని సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అయ్యారు. ప్రముఖ నటుడు ఎన్టీఆర్ అదేనండి నందమూరి తారకరత్న హీరోగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవినేని’ సినిమాలో  సంగీత దర్శకుడు కోటి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ పొలిటీషన్ దేవినేని నెహ్రూ జీవిత కథతో తెరకెక్కుతోన్నఈ సినిమాలో కోటి ప్రముఖ ఐపీఎస్ వ్యాస్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ కోటీ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది.

telugu senior music director koti to act police officer vyas ips charecter in taraka ratna devineni movie,koti,music director koti,vyas ips charecter music director koti,gang leader movie review,nanis gang leader movie review,nani gang leader moview review,vyas ips koti,ntr,nandamuri tharaka ratna,tharaka ratna as devineni nehru,koti as vyas ips,devineni movie,tollywood,telugu cinema,వ్యాస్ ఐపీఎస్,కోటి,మ్యూజిక్ డైరెక్టర్ కోటి,సంగీత దర్శకుడు కోటి,సంగీత దర్శకుడు సాలూరి కోటి,వ్యాస్ ఐపీఎస్ పాత్రలో కోటి,దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న,తారకరత్న,దేవినేని మూవీ,దేవినేని,శివనాగేశ్వరరావు,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,
వ్యాస్ ఐపీఎస్ పాత్రలో సంగీత దర్శకుడు కోటి (Twitter/Photo)


పోలీస్ ఆఫీసర్ వ్యాస్ పాత్రలో కోటీ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, దేవినేని నెహ్రూగా నందమూరి తారకరత్న, వంగవీటి రంగాగా సురేష్ కొండేటి నటిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయినట్టు చిత్ర దర్శకుడు తెలిపాడు. ఇక సంగీత దర్శకుడిగా రెండు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కోటి.. ఈ సినిమాతో నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.. చిన్నపుడు మా నాన్న సాలూరు రాజేశ్వరరావు తనను ఐపీఎస్‌గా చూడాలనుకున్నారు. దర్శకుడు వచ్చి కథ చెప్పేసరికి ఈ సినిమాలో వ్యాస్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నట్టు చెప్పుకొచ్చారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు