ఇదే అసలు సిసలైన ఫసక్.. సర్జికల్ స్ట్రైక్‌‌‌పై మోహన్ బాబు పంచ్‌లు

మంగళవారం తెల్లవారుఝామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 300 మంది ముష్కరులు హతమైనట్టు సమాచారం.తాజాగా భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రైక్‌పై సీనియర్ నటుడు మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 27, 2019, 9:25 AM IST
ఇదే అసలు సిసలైన ఫసక్.. సర్జికల్ స్ట్రైక్‌‌‌పై మోహన్ బాబు పంచ్‌లు
మోహన్ బాబు
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 27, 2019, 9:25 AM IST
మంగళవారం తెల్లవారుఝామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 300 మంది ముష్కరులు హతమైనట్టు సమాచారం.

అంతేకాదు భారత వైమానిక దాడులతో పాకిస్థాన్ బెంబెలెత్తిపోతుంది. ఈ దాడికి భారత వాయుసేన పైలెట్లు మిరాజ్ 200 ఫైటర్ జెట్‌లను వాడారు. ఈ దాడిపై టాలీవుడ్‌, బాలీవుడ్కు చెందిన  నటీనటులందరు సామాజిక మాధ్యమాల ద్వారా భారత వాయుసేనకు చేసిన ఈ పనికి సెల్యూట్ చేసారు.

తాజాగా భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్‌పై సీనియర్ నటుడు మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు. ఈ మధ్య ఓ వీడియోలో మోహన్ బాబు ‘ఫసక్’ అనే పదం వాడారు. ఈ పదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.


Loading...
అయితే భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రైకే అసలైన ఫసక్ అని మెరుపు దాడులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ఇది ఫసక్‌కి అసలైన అర్ధం. జై హింద్. గో ఇండియా అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఐతే ఈ దాడిలో సామాన్య పౌరులకు గాయం కాకుండా..వాయు బలగాలు దాడిలో పెద్ద ఎత్తున ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.

 

 
First published: February 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...