TELUGU POPULAR SHOW JABARDASTH NARESH TO MARRY A BHIMAVARAM GIRL SOON NEWS VIRAL NR
Jabardasth Naresh: భీమవరం అల్లుడు కానున్న జబర్దస్త్ నరేష్.. రెండో పెళ్లిపై అసలు విషయం బయట పెట్టిన శాంతి స్వరూప్!
jabardasth naresh
Jabardasth Naresh: బుల్లితెరలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఎన్నో ఏళ్ల నుండి ప్రసారమవుతున్న ఈ షో ఎంతోమందిని ఆర్టిస్ట్ లుగా మార్చి మంచి హోదాలో ఉండేలా చేసింది. అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకునేలా కూడా చేసింది.
Jabardasth Naresh: బుల్లితెరలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ (Jabardasth) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఎన్నో ఏళ్ల నుండి ప్రసారమవుతున్న ఈ షో ఎంతోమందిని ఆర్టిస్ట్ లుగా మార్చి మంచి హోదాలో ఉండేలా చేసింది. అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకునేలా కూడా చేసింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క కమెడియన్లు మంచి పేరు సంపాదించుకోగా.. ఇందులో ఒకరు పొట్టి నరేష్ (Jabardasth Naresh) కూడా తన కామెడీ టైమింగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే పొట్టి నరేష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడని కొన్ని నిజాలు బయటపడ్డాయి.
చూడటానికి మూడు అడుగులు ఉండే పొట్టి నరేష్ తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో ఢీ జూనియర్స్ లో పాల్గొనగా.. ఆ తర్వాత సునామి సుధాకర్ జబర్దస్త్ (Jabardasth)లో అవకాశం వచ్చేలా చేశాడు. అలా కొన్నాళ్ళు చంటి టీమ్ లో చేయగా.. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ (Bullet Bhasker) లో చేరి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. కొన్ని కొన్ని సార్లు లేడీ గెటప్ లో కూడా వచ్చి బాగా రచ్చరచ్చ చేస్తుంటాడు.
ఇదంతా పక్కన పెడితే నరేష్ పెళ్లి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. లేడీ గెటప్ లో అలరించే మరో కమెడియన్ శాంతి స్వరూప్ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పంచుకుంది. అందులో తనతో పాటు బుల్లెట్ భాస్కర్, పొట్టి నరేష్ ఉండగా వాళ్లంతా ఓ ఈవెంట్ కు వెళుతున్నట్లు తెలిపారు. ఇక ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని విషయాలు బయట పెట్టింది శాంతిస్వరూప్. (Shanthi Swaroop) పొట్టి నరేష్ ఈ మధ్యనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు అని శాంతి స్వరూప్ అనడంతో.. వెంటనే బుల్లెట్ భాస్కర్ ఈమధ్యనే పెళ్లిచూపులు కూడా జరిగాయని.. త్వరలోనే పెళ్లి జరగనుందని అన్నాడు.
అంతేకాకుండా అమ్మాయిది భీమవరం అని డిగ్రీ వరకు చదివిందని ఆమె చూడటానికి 5 అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు ఉంటుందని.. ఆమె పేరు శకుంతల అని బుల్లెట్ భాస్కర్ అనడంతో.. పక్కనున్న నరేష్ (Jabardasth Naresh) మాత్రం ఇది నిజం కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో నరేష్ గురించి కావాలని మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. ఇక నరేష్ వయసు 20 ఏళ్లు అని గతంలో తెలిసింది. ఇది వరకే ఈయనకు పెళ్లి అయిందని ఆమె పేరు త్రిపురాంబిక అని పేరు కూడా ప్రచారం జరుగగా.. ఆమె నరేష్ భార్య కాదని మరో పొట్టి నటుడు రమేష్ భార్య అని తెలిసింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.