Home /News /movies /

TELUGU POPULAR DIRECTOR VV VINAYAK PLAYING A HERO ROLE IN DIL RAJU PRODUCTION HERE ARE THE DETAILS SR

వివి వినాయక్ హీరోగా దిల్ రాజు సినిమా.. దర్శకుడి సరసన చిరంజీవి హీరోయిన్

దిల్ రాజు, వివి వినాయక్

దిల్ రాజు, వివి వినాయక్

వివి వినాయక్..దర్శకుడుగా మనకు పరిచయమే. తెలుగులో సీనియర్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్‌లు కొట్టాడు. అయితే ఆయన ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

    వివి వినాయక్..దర్శకుడుగా మనకు పరిచయమే. తెలుగులో సీనియర్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్‌లు కొట్టాడు. అయితే ఆయన ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తెలుగు సినిమాలకు సంబందించి గతంలో చాలా మంది హీరోలు దర్శకులుగా మారారు. అలాగే దర్శకులు కూడా కొన్ని సినిమాల్లో తెర మీద కనిపించడం జరిగింది. ఇప్పుడు ఇలాంటిదే వివి వినాయక్ విషయంలో జరగబోతోంది. వినాయక్ 2002లో జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఆది' సినిమాతో దర్శకుడిగా మారి..సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితోనూ పనిచేసి తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అయితే గత కొంత కాలం నుండి వినాయక్‌కు వరుసగా డిజాస్టర్స్ వస్తున్నాయి. దానికి తోడు సినిమా అవకాశాలు మందగించాయి. దీంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అందులో భాగంగా వినాయక్ ఇప్పుడు వెండితెర మీద హీరోగా నటించనున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకుముందు వినాయక్, దిల్ రాజు కాంబినేషల్‌లో నితిన్ హీరోగా 'దిల్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

     శ్రియా సరన్, వివి వినాయక్

    శ్రియా సరన్, వివి వినాయక్


    అప్పటివరకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న దిల్ రాజు 'దిల్' సినిమాతో నిర్మాతగా మారి దిల్ రాజుగా ప్రస్తుతం తెలుగులో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా వెలుగుతున్నారు. అయితే దిల్ రాజు దగ్గరకు వచ్చిన కథల్లో ఓ కథ వినాయక్‌కు బాగా సూట్ అవ్వుద్దని భావించిన రాజు వినాయక్‌కు కథ వినిపించడంతో..ఆ కథ వినాయక్ కూడా నచ్చడంతో సినిమా అలా కుదిరిపోయింది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు..త్వరలోనే వెలువడే అవకాశం ఉండనుంది. ఇక ఈ సినిమాలో వినాయక్‌కి జోడిగా ఓ సీనియర్ హీరోయిన్‌‌ను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఠాగూర్' సినిమాలో నటించిన శ్రియా సరన్..వినాయక్ సరసన హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇప్పటివరకు హీరోల్నీ డైరెక్ట్ చేసిన వినాయక్..తొలిసారి హీరోగా చేస్తున్నారు. చూడాలి ఈ పాత్రలో ఆయన ఎలా తెలుగు ప్రేక్షకుల్నీ అలరించనున్నారో.
    First published:

    Tags: Dil raju, Shriya, Telugu Cinema, Telugu Cinema News, Telugu Movie, Telugu Movie News, Tollywood, Tollywood Cinema, Tollywood Movie News, Tollywood news, VV Vinayak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు