పుట్టినరోజున హీరోగా వివి వినాయక్ మూవీ.. దర్శకుడి సరసన బాలయ్య భామ..

వివి వినాయక్..దర్శకుడుగా మనకు పరిచయమే. తెలుగులో సీనియర్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్‌లు కొట్టాడు. అయితే ఆయన ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమా వినాయక్ పుట్టినరోజున ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: September 14, 2019, 8:41 PM IST
పుట్టినరోజున హీరోగా వివి వినాయక్ మూవీ.. దర్శకుడి సరసన బాలయ్య భామ..
వివి వినాయక్ షాకింగ్ మేకోవర్
  • Share this:
వివి వినాయక్..దర్శకుడుగా మనకు పరిచయమే. తెలుగులో సీనియర్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్‌లు కొట్టాడు. అయితే ఆయన ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తెలుగు సినిమాలకు సంబందించి గతంలో చాలా మంది హీరోలు దర్శకులుగా మారారు. అలాగే దర్శకులు కూడా కొన్ని సినిమాల్లో తెర మీద కనిపించడం జరిగింది. ఇప్పుడు ఇలాంటిదే వివి వినాయక్ విషయంలో జరగబోతోంది. వినాయక్ 2002లో జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఆది' సినిమాతో దర్శకుడిగా మారి..ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితోనూ పనిచేసి తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ మూవీస్ చేయడంతో దర్శకుడిగా వినాయక్ క్రేజ్ తగ్గింది.  ఇక చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను డైరెక్ట్ చేసి హిట్టు కొట్టినా.. ఆ క్రెడిట్ మొత్తం మెగాస్టార్ ఖాతాలోకి వెళ్లింది. దాదాపు తొమ్మిదేళ్ల ల్యాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా చూడడానికి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపెట్టారు. దీంతో ఖైదీ నెంబర్ 150 హిట్టైనా.. వినాయక్‌కు ఒరిగిందేమి లేదు.

‘ఖైదీ నెంబర్ 150’ సెట్‌లో చిరంజీవికి వినాయక్ సూచనలు (Facebook/Photo)


ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్‌తో చేసిన ‘ఇంటిలిజెంట్’ ...అంతకు ముందు అఖిల్ హీరోగా పరిచయమైన ‘అఖిల్’ సినిమా చూసి నిజంగానే వినాయక్ ఈ చిత్రాలను తెరకెక్కించాడా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో కలిగిలే చేసాడు. దానికి తోడు వినాయక్‌ను నమ్మి  సినిమాలు తీయడానికి అటు హీరోలు, ఇటు నిర్మాతలు వెనకాడుతున్నారు. మాములుగా కథ నచ్చాలే కానీ దర్శకుడి ట్రాక్ అంతగా పట్టించుకోని బాలకృష్ణ కూడా వి.వి.వినాయక్ దర్శకత్వ ప్రతిభపై అనుమానాలు వచ్చి ఆ సినిమాను పక్కన పెట్టాడంటే వినాయక్ దర్శకుడిగా ఎంతగా ఫామ్ కోల్పోయాడో దీన్ని బట్టి అర్ధమవుతోంది.

Shocking.. VV Vinayak taking a sensational decision over his directional career and thinking about retirement pk.. ఇండ‌స్ట్రీలో గ‌తం ఏంటి అనేది ఎవ‌రూ అడ‌గ‌రు. ప్ర‌స్తుతం ఏంటనేది ఇక్క‌డ అంద‌రికీ కావాలి. గ‌తం ఎంత ఘ‌నంగా ఉన్నా కూడా ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ అయితేనే ప‌ట్టించుకుంటారు. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. vv vinayak,vv vinayak twitter,vv vinayak instagram,vv vinayak retirement,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ రిటైర్మెంట్,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
వినాయక్ బాలయ్య


తాజాగా అవకాశాలు మందగించడంతో  ఇపుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అందులో భాగంగా వినాయక్ ఇప్పుడు వెండితెర మీద హీరోగా నటించనున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకుముందు వినాయక్, దిల్ రాజు కాంబినేషల్‌లో నితిన్ హీరోగా 'దిల్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తన బ్యానర్‌లో మొదటి సినిమాను తెరకెక్కించిన వి.వి.వినాయక్‌ హీరోగా తెరకెక్కే మొదటి సినిమా బాధ్యతలను దిల్ రాజు తీసుకున్నాడు.

దిల్ రాజు, వివి వినాయక్


ఈ సినిమా వినాయక్ పుట్టినరోజైన అక్టోబర్ 9న  ప్రారంభం కానుంది. ఈ  సినిమాను ‘శరభ’ ఫేమ్ నరసింహారావు డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా కోసం వినాయక్ బాగానే బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు. తాజాగా జిమ్‌లో సన్నబడ్డ వినాయక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జిమ్ తర్వాత సన్నబడ్డ వివి వినాయక్ (Instagram/Photo)


ఈ సినిమాను 1980నాటి పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్టు సమాచారం.  ఈ సినిమాలో వినాయక్‌కి జోడిగా సీనియర్ హీరోయిన్‌‌ శ్రియను ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి’’ 'ఠాగూర్' సినిమాల్లో కథానాయిక నటించిన శ్రియా సరన్..వినాయక్ సరసన హీరోయిన్‌గా నటించడం విశేషం.

శ్రియా సరన్, వివి వినాయక్


నటుడిగా చిరంజీవి హీరోగా నటించిన ‘ఠాగూర్’,‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో గెస్ట్‌గా నటించారు. ఇప్పటివరకు హీరోల్నీ డైరెక్ట్ చేసిన వినాయక్..తొలిసారి హీరోగా చేస్తున్నారు. ఈ పాత్రలో ఆయన  తెలుగు ప్రేక్షకుల్నీ ఎలా అలరించనున్నారో చూడాలి.
First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading