హోమ్ /వార్తలు /సినిమా /

మేకప్ లేకుండా యాంకర్ సుమ ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి..

మేకప్ లేకుండా యాంకర్ సుమ ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి..

యాంకర్ సుమ కనకాల (suma kanakala)

యాంకర్ సుమ కనకాల (suma kanakala)

యాంకర్ సుమ.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు విడదీయరాని అనుబంధం ఉంది. రెండు దశాబ్ధాలుగా ఈమె టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. తాజాగా సుమ.. మేకప్ లేకుండా దిగిన ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

యాంకర్ సుమ.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు విడదీయరాని అనుబంధం ఉంది. రెండు దశాబ్ధాలుగా ఈమె టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. ఇప్పుడు ఈమె తన ఇమేజ్‌ను స్మాల్ స్క్రీన్‌తో  పాటు సోషల్ మీడియా, డిజిటల్‌‌కు కూడా పాకేసింది. ఈ మధ్యే సుమక్క అనే యూ ట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో కొన్ని ఫన్నీ వీడియాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పోస్ట్ చేస్తుంది. పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్‌ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ భామ. తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో మేకప్ లేకుండా తన మార్నింగ్ ఎలా గడుస్తోందో చూపెట్టింది. అంతేకాదు మేకప్ లేకుండా నా శరీరం శ్వాస తీసుకుంటుంది కూల్ అంటూ వీడియో విడుదల చేసింది.

ఇందులో నిన్న క్యాష్ షూటింగ్ అయింది. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఇలానే ఉంటుంది. ఆ షోలో తనకు వివేక్ వర్ధిని కాలేజ్ వాళ్లు ఈ పెయింటింగ్ ఇచ్చారు. నిజంగానే చాలా అందంగా ఉంది. కాలేజ్ విద్యార్ధులకు, వాసు యాడ్స్ వారికి థాంక్స్ చెప్పింది. ఇలాంటి పేయింటింగ్స్ కోసమైనా.. మేకప్ వేసుకొని పనిచేయాలనే ఉత్సాహం తనలో కలుగుతోంది అని పేర్కొంది. చివరకు సత్తి, రమేష్ పదండి.. యుద్దానికి వెళ్ధాం అంటూ చెప్పడం విశేషం.

First published:

Tags: Anchor suma, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు