బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీముఖి..అందుకే పటాస్ నుండి తప్పుకుందా..

శ్రీముఖి.. పటాస్ షో ద్వారా రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటోంది. ఆమె ఈ షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. అలాంటీ షో నుండి కొంత కాలం విరామం తీసుకున్నట్లు శ్రీముఖి ప్రకటించింది. ఇప్పుడు దీనికి కారణం ఎంటో తెలిసింది.

news18-telugu
Updated: May 17, 2019, 1:12 PM IST
బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీముఖి..అందుకే పటాస్ నుండి తప్పుకుందా..
శ్రీముఖి
  • Share this:
శ్రీముఖి..'పటాస్' షో ద్వారా రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటోంది. ఆ షోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలుస్తూ వచ్చాయి. అయితే కేరిర్ ఆరంభంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌తో యాంక‌ర్‌గా మొద‌లుపెట్టిన..శ్రీముఖి, ఆ త‌ర్వాత యాక్టర్‌గా మారి కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అటూ సినిమాలు చేస్తూనే ఇటూ యాంకరింగ్ చేస్తూ..తెలుగు వారికి చాలా దగ్గరైంది. ఇటీవలే శ్రీముఖి పుట్టిన రోజు కూడా జరుపుకుంది. అది అలా వుంటే ఆమెకు అంతాలా పేరు తెచ్చిన 'పటాస్' షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకొవాలని భావిస్తోంది శ్రీముఖి. అయితే 'పటాస్' షోకు ప్రధాన ఆకర్షణ శ్రీముఖి.  తన అందం, అల్లరితో షోను పరుగులు తీయించడమే కాదు, తన గ్లామర్‌తో కొత్త అందాన్ని తీసుకొచ్చింది ఆ షోకి. అలాంటీ శ్రీముఖి పటాస్ నుండి కొంత విరామం కావాలని కోరుకుంటోంది. దానికి సంబందించిన ఓ వీడియోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'పటాస్' షో ప్రొడ్యూసర్స్ అనుమతితోనే బ్రేక్ తీసుకుంటున్నన్నట్టు ఆమె తన వీడియోలో పేర్కోంది.

యాంకర్ శ్రీముఖి, శ్రీముఖి Dance, శ్రీముఖి రవి, శ్రీముఖి పటాస్,శ్రీముఖి భర్త,శ్రీముఖి హాట్, శ్రీముఖి రాములమ్మ డ్యాన్స్,శ్రీముఖి రొమాన్స్, Anchor Sreemukhi, Sreemukhi hot, Sreemukhi hot photoshoot, Sreemukhi dance, Sreemukhi pataas show, srimukhi hot romance, Sreemukhi movies,anchor sreemukhi ravi,sreemukhi instagram, sreemukhi twitter, sreemukhi facebook, Sreemukhi husband, sreemukhi lip lock kiss,sreemukhi navel
యాంకర్ శ్రీముఖి  Photo : Instagram


అయితే దానికి కారణం మాత్రం వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం..శ్రీముఖికి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెకు 'బిగ్ బాస్ 3' సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చిందట. ఆ షోలో పాల్గొనడం కోసమే శ్రీముఖి బ్రేక్ తీసుకుందనేది సమాచారం. ఇప్పటికే రెండు సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ షో, త్వరలో తన మూడవ సీజన్‌‌తో తెలుగువారిని అలరించడానికి సిద్దమవుతోంది. ఈ ప్రస్తుత సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఈ తాజా సీజన్  జూలై రెండవ వారంలో ప్రారంభం కానుంది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>