‘పటాస్’ షోకు బై బై చెప్పేసిన యాంకర్ రవి.. ఇంతకీ ఏం జరిగింది..

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈ కుర్ర యాంకర్..తనదైన యాంకరింగ్‌తో ప్రోగ్రామ్‌ను రక్తి కట్టించడం రవి స్పెషాలిటీ. తాజాగా రవి..పటాస్ షో నుండి పక్కకు తప్పుకున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: November 15, 2019, 8:03 AM IST
‘పటాస్’ షోకు బై బై చెప్పేసిన యాంకర్ రవి.. ఇంతకీ ఏం జరిగింది..
యాంకర్ రవి ఫైల్ ఫోటో
  • Share this:
తెలుగు ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈ కుర్ర యాంకర్..తనదైన యాంకరింగ్‌తో ప్రోగ్రామ్‌ను రక్తి కట్టించడం రవి స్పెషాలిటీ. ఒక టీవీ షోలు.. మరోవైపు సినిమా ఈవెంట్‌లు.. ఇది చాలదన్నట్టు సినిమాలు ఇలా సాగిపోతుంది యాంకర్ రవి జీవితం. ఇక రవి యాంకరింగ్ చేస్తున్నాడంటే.. బోల్డ్ పంచ్‌లు పడాల్సిందే. ఇక లేడీ యాంకర్లతో రవి ఆన్ స్కీన్ కెమిస్ట్రీ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రవి.. ‘పటాస్’ ప్రోగ్రామ్‌ నుంచి పక్కకు తప్పుకున్నట్టు సమాచారం. ఐతే.. రవి ఈ షో తప్పుకోవడంపై ఒక రీజనుంది. రవి.. పటాస్ షో  పాటు ఒక శాటిలైట్ ఛానల్‌తో అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఐతే.. ‘పటాస్’ షోను చేస్తున్న మల్లెమాల సంస్థ .. చేస్తే కేవలం ‘పటాస్’ షో మాత్రమే చేయాలి. వేరేవి చేయడానికి వీళ్లెదని కండిషన్స్ పెట్టిందట. దీంతో యాంకర్ రవి చేసేది లేక ‘పటాస్’ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్టు సదరు యాజమాన్యానికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక రవి స్థానంలో యాంకర్‌గా నోయల్ లేదా జబర్థస్త్ కమెడియన్ చంటి పేర్లను పరిశీలిస్తున్నారు.

First published: November 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>