TELUGU MOVIE PRODUCER GORANTLA RAJENDRAPRASAD PASSED AWAY SR
Gorantla Rajendraprasad Passed Away : చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత..
Gorantla Rajendraprasad Passed Away
Gorantla Rajendraprasad Passed Away : తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. ఎడిటర్ గౌతంరాజు మరణం మరవక ముందే మరో ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ (86) (Gorantla Rajendraprasad) కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. ఎడిటర్ గౌతంరాజు మరణం మరవక ముందే మరో ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ (86) కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. గోరంట్ల రాజేంద్రప్రసాద్ (Gorantla Rajendraprasad Passed Away ) , రామానాయుడుతో కలిసి ఎన్నో మంచి చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా మాధవి పిక్చర్స్ బ్యానర్లో ఆయన ‘దొరబాబు’, ‘సుపుత్రుడు’, ‘కురుక్షేత్రం’, ‘ఆటగాడు’ వంటి సినిమాలను నిర్మించి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరుపోందారు. ఇక రాజేంద్రప్రసాద్ మరణంతో టాలీవుడ్ ప్రముఖులు, పెద్దలు దిగ్భ్రాంతికి గురైయ్యారు. అంతేకాకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
ఇకమరోవైపు ఈ మధ్య కాలంలో వరుసగా టాలీవుడ్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఎడిటర్ గౌతంరాజు మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతంరాజు పరిస్థితి విషమించడంతో తుదిశ్యాస విడిచారు (Editor Goutham Raju Passed Away). గౌతంరాజు తెలుగులో ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. దాదాపుగా 850 సినిమాల వరకు ఎడిటర్‌గా పనిచేశారు.
బి గోపాల్, కోటి, మోహన్ బాబులతో ఎడిటర్ గౌతమ్ రాజు Photo : Facebook
తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేసి తన మార్క్ చూపించేవారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రాలైన చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ రేసుగుర్రం, బలుపు, బద్రీనాథ్, డాన్ శీను, వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన పనిచేశారు. ఇక గౌతంరాజుతో పాటు ఇటీవల ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరణించగా.. ఆర్.నారాయణ మూర్తి తల్లి, సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.