TELUGU HOT ANCHOR RASHMI GAUTHAM HOTTEST COMMENTS ON MARRIAGE IN AASHADAMLO ATHAKODALLU EVENT NR
Rashmi Gautham: ఇంత వయసు వచ్చింది.. ఇంకా పెళ్లి చేసుకోను అంటూ రష్మీ షాకింగ్ కామెంట్స్?
Rashmi Gautam
Rashmi Gautham: బుల్లితెర యాంకర్, గ్లామర్ బ్యూటీ రష్మీ గౌతమ్. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రష్మీ మొత్తానికి ఓ సెలబ్రిటీ హోదాను అందుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
Rashmi Gautham: బుల్లితెర యాంకర్, గ్లామర్ బ్యూటీ రష్మీ గౌతమ్. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రష్మీ మొత్తానికి ఓ సెలబ్రిటీ హోదాను అందుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. కానీ తనకంటూ గుర్తింపుని మాత్రం బుల్లితెరపై తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక జబర్దస్త్ లో తను ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి కారణం మరో ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్ అనే చెప్పవచ్చు. అతడితో షో లో అందరి ముందు బాగా రచ్చ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక జబర్దస్త్ లోనే కాకుండా మరో షో ఢీ లో కూడా టీమ్ లీడర్ గా చేస్తుంది. అందులో కూడా సుడిగాలి సుధీర్ తో తెగ రొమాన్స్ లతో బాగా రెచ్చిపోతుంది. దీంతో ఈ అమ్మడు అలా ఓ క్రేజ్ సంపాదించుకుంది. పైగా రష్మీ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా తన వయసు, పెళ్లి గురించి ఓపెన్ గా మాట్లాడింది రష్మీ.
తాజాగా రష్మీ మరో షో లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆషాడం సందర్భంగా జీ తెలుగులో ప్రసారం కానున్న 'ఆషాడం అత్తా కోడళ్ళు' అనే ఈవెంట్ లో పాల్గొన్నది. ఇక ఇందులో నటి శ్యామలతో పాటు రవి యాంకర్ లుగా చేశారు. సినీ నటి సంగీత ఈవెంట్ గెస్ట్ గా పాల్గొన్నది. ఇక ఇందులో రష్మీ ఎంట్రీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా ఓ పాటతో అందరిని మెప్పించింది రష్మీ.
ఇదిలా ఉంటే ఇందులో ఓ గేమ్ లో భాగంగా మరో నటిని రెండు చెంపలపై కొడుతుండగా.. వెంటనే శ్యామల హే నువ్వు అత్తలా మారకు.. కోడలు మాత్రమే అని అనగా.. వెంటనే రష్మీ.. ఇంత వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు.. డైరెక్ట్ గా నేను అత్తలా అప్ గ్రేడ్ అవుతా అంటూ తన వయసు పై, పెళ్లిపై ఓ కామెంట్ చేసింది. అంతేకాకుండా యాంకర్ రవి తో కూడా ఓ మాట అనేసింది. నీకు ఉన్నది తీసేస్తా.. నీ బట్టలు విప్పేస్తా అంటూ డబుల్ మీనింగ్ మాటతో రెచ్చిపోయింది. ఈ మాట విని అక్కడున్న వాళ్లంతా తెగ షాకయ్యారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.