కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కొద్దిగా కేసులు తగ్గడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా థియేటర్లను ఓపెన్ చేయాడనికి అనుమతిని ఇచ్చాయి. దీంతో జూలై 30నుంచి చిన్న చిన్న సినిమాలన్ని ఒక్కొక్కటిగా విడుదల అవుతూ వస్తున్నాయి. ఇక ఈ మధ్యనే పెద్ద సినిమాలు కూడా విడుదలకు సై అంటున్నాయి. అందులో భాగంగా ఇటీవల (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి అనే సినిమా వచ్చి ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా లవ్ స్టొరీ 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది. ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.5 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక తాజాగా బ్రేక్ ఈవెన్ కూడా బ్లాక్ బస్టర్ దిశగా నడుస్తోంది.
ఇక తాజాగా అక్టోబర్ 1న సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) రిపబ్లిక్ విడుదలైంది. దేవ కట్టా (Deva Katta) దర్శకత్వం వహించారు. వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్' సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. రాజకీయ, అధికారిక, న్యాయ వ్యవస్థలకు మీడియా అనే నాలుగో వ్యవస్థ తోడుగా ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ రాజకీయం అనే వ్యవస్థ మిగిలిన అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం అన్నది ఎక్కడ వుంటుంది అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించారు దేవా కట్టా. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటించారు.
ఇక ఈ అక్టోబర్ నెలలో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయి.. ఎప్పుడు విడుదలవుతున్నాయో చూద్దాం.. ఈ నెలలో ముఖ్యంగా దసరా పండుగ లక్ష్యంగా ఐదు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అంతేకాకుండా విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించాయి.
అక్టోబర్ 8న కొండపొలం :
అక్టోబర్ 8న వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) కొండపొలం విడుదలవుతోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా చేసింది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కొండపొలం (Kondapolam) ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక ఇప్పటికే ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది. పులితో సీన్స్, రకుల్‌తో రొమాన్స్, విజువల్స్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్. నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.
MAA Politics: మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల హస్తం నిజమేనా… వారి ప్రకటనల్లో నిజమెంత..?
బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి.. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది. క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు.
అక్టోబర్ 14న మహా సముద్రం :
ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వం వహించారు. ‘మహా సముద్రం’ (Maha Samudram). లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటిస్తున్న సంగతి తెలిసిందే. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌లో యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఇక ఈ ట్రైలర్‌ను చూసిన ప్రభాస్ తాజాగా మహా సముద్రం టీమ్‌ను మెచ్చుకున్నారు. చిత్ర ట్రైలర్ బాగుందని... చాలా ఇంటెన్స్‌గా ఉందని.. తన సోషల్ మీడియాలో పేర్కోన్నారు.
ట్రైలర్‌లో ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. సముద్రం చాలా గొప్పది మామ. తనలో చాలా రహస్యలు దాచుకుంటుంది. నవ్వుతూ కనిపించనంత మాత్రానా బాగున్నట్టు కాదు అర్జున్ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగులు, మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా అంటూ సిద్ధార్థ్ చెప్పే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Anchor Anasuya : బాహుబలి హీరోయిన్‌ని కాదని యాంకర్ అనసూయకు అవకాశం..
ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఆట, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలగు చిత్రాలతో సూపర్ క్రేజీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 19న విడుదల కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల్లో విడుదల వాయిదా పడింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చగా.. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ :
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానుంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలవనుందని టాక్. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. బన్ని వాసు నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 15న పెళ్లి సందD :
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తోన్న చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతంలో పెళ్లి సందడి సంగీతం అందించిన కీరవాణి, గీతా రచయిత చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. రాఘవేంద్రరావు కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగులో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అతడే..?
అక్టోబర్ 15న వరుడు కావలెను :
యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) చేస్తోన్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. వరుడు కావలెను (Varudu Kaavalenu)చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' (digu digu digu naaga song) అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు. థమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు.
నాట్యం అక్టోబర్ 22న విడుదల :
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం తాజా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, ‘శుభలేఖ’ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను నిశృంఖల ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kondapolam, Maha Samudram, Most Eligible Bachelor, Tollywood news