మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో...ఈ సారి..!

మెగా ఫ్యామిలీ నుండి..మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు.

news18-telugu
Updated: April 6, 2019, 4:41 PM IST
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో...ఈ సారి..!
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో..
news18-telugu
Updated: April 6, 2019, 4:41 PM IST
మెగా ఫ్యామిలీ నుండి..మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. నిర్మాత అల్లు అరవింద్‌కు బంధువైన విరాన్ ముత్తంశెట్టి..హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను పి.సి.ఎం. స్టూడియోస్, మైత్రి అసోసియేషన్ బ్యానర్లను నిర్మిస్తున్నారు. చిట్టిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దేవుడు ఒక అవతారం ఎత్తుతాడనేది గీతా సారాంశం. కానీ ధర్మం నశించి... ఆ దేవుడి ఉనికే ప్రశ్నగా మారిన ఇప్పటి లోకానికి ఆ దేవుడిని పరిచయం చేసిన ఓ యువకుడి కథే ఈ సినిమా అని ..నిర్మాత బాబ్జి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మా సినిమా సరికొత్త కథనంతో ఉండబోతోందని..తెలుపుతూ..ఈ సినిమాని తెలుగుతో పాటు, తమిళ, మలయాళ భాషలలో కూడా విడుదల చేయనున్నామన్నారు .

నటుడుగా పరిచయం కాబోతున్న విరాన్ Photo: Facebook


ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవరిస్తున్న ధర్మప్రసాద్ మాట్లాడుతూ.. తిరుపతి, రంపచోడవరం, కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాలలో షూటింగ్ జరుపుతామని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం వెనుక ఉన్న చరిత్ర నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని..తెలుపుతూ ఈ సినిమాలో గ్రాఫిక్స్ అధికంగా ఉండనున్నాయన్నారు. మిగితా టెక్నికల్..ఇతర విషయాలను త్వరలో తెలియజేస్తామన్నారు.

First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...