Vijay Nirmala : విజయ నిర్మల మృతిపై త్రివిక్రమ్‌ విచారం.. కృష్ణ‌కు పరామర్శ

విజయ నిర్మల మృతి పట్ల దర్శకుడు త్రివిక్రమ్‌ విచారం వ్యక్తం చేశారు. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి..అటువంటి విజయ నిర్మల స్థానంను ఎవరు భర్తీ చేయలేనిదన్నారు.

news18-telugu
Updated: June 29, 2019, 4:52 PM IST
Vijay Nirmala : విజయ నిర్మల మృతిపై త్రివిక్రమ్‌ విచారం..  కృష్ణ‌కు పరామర్శ
కృష్ట, నరేష్‌, త్రివిక్రమ్
  • Share this:
విజయ నిర్మల.. నటిగా,దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు తెరపై తనదైన ముద్ర వేసారు. ఆమె బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విజయ నిర్మల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో భానుమతి తర్వాత ఆ స్థాయిలో గర్వించదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల అని ఆయన కొనియాడారు. ఆమె లేని లోటు యావత్ తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. హీరో జూనీయర్ ఎన్టీఆర్ కూడా విజయ నిర్మల మృతిపై ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. దిగ్గజ దర్శకురాలైన విజయ నిర్మల ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

నరేష్‌, త్రివిక్రమ్, కృష్ట


తాజగా విజయనిర్మల మృతి పట్ల దర్శకుడు త్రివిక్రమ్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఉదయం కృష్ణ నివాసానికి వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను కలిసి తన సానుభూతి ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో విజయనిర్మల వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి స్థానం భర్తీ చేయలేనిదన్నారు.

First published: June 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు