హోమ్ /వార్తలు /సినిమా /

TFCC: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వేతనములను సవరించిన చలన చిత్ర వాణిజ్య మండలి..

TFCC: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వేతనములను సవరించిన చలన చిత్ర వాణిజ్య మండలి..

కార్మికుల వేతనాలపై TFI సంచలన నిర్ణయం (File/Photo)

కార్మికుల వేతనాలపై TFI సంచలన నిర్ణయం (File/Photo)

TFCC: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (Telugu Film Chamber of Commerce) నిర్ణయించిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వేతనములు, విధి విధానములు ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TFCC: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (Telugu Film Chamber of Commerce) నిర్ణయించిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వేతనములు, విధి విధానములు 01-07-2022 నుండి 30/06/2025 తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయించిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వేతనములు, విధి విధానములు 01-07-2022 నుండి 30/06/2025

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో వాణిజ్య మండలి అధ్యక్షులు  K. బసిరెడ్డి, గౌరవ కార్యదర్శి K.L. దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు C.కళ్యాణ్, గౌరవ కార్యదర్శి T. ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శికె. అనుపమ్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు మరియు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ P.S.N. దొర, కోశాధికారి సురేష్ లు పాల్గొన్న సమావేశములులో వేతనములు, విధివిధానములు అన్నియు ఖరారు చేశారు.

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి  (TFCC) 2018 సంవత్సరములో చేసిన ఒప్పందంను అనుసరించి ఆ వేతనముల మీద పెద్ద సినిమాలకు 30%, చిన్న సినిమాలకు 15% పెంచేందుకు అంగీకరించారు. ఈ పెంచిన వేతనములు 01-07-2022 వ తేదీనుండి  30-06-2025 వరకు అమలులో ఉంటాయని, అలాగే ఏది చిన్న సినిమా అనేది చలన చిత్ర వాణిజ్య మండలి మరియు ఎంప్లాయిస్ ఫెడరేషన్‌లతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ 22 జూన్ నుంచి సమ్మె చేస్తున్నట్టు  నోటీసులు ఇచ్చారు. గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ కోవిడ్ కారణంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇపుడిపుడే ఇండస్ట్రీ కోలుకుంటోంది. మరోవైపు సినిమాల్లో హీరోలకు కోట్లకు కోట్లకు ఇచ్చే నిర్మాతలు .. అందులో పనిచేసే 24 క్రాఫ్ట్ మెంబర్స్‌కు తగివ వేతనాన్ని ఇవ్వడం లేదంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే కదా.

TFCC ప్రకటన (Twitter/Photo)

గత కొన్నేళ్లుగా సినీ కార్మికుల వేతనాల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఇంటా బయటా అన్నింటా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దానికి తగ్గట్టు జీతాలు మాత్రం పెరగడం లేదు. దీంతో గత కొన్నేళ్లుగా సినీ కార్మికులు వేతనాలు పెంచమంటూ  నిర్మాతల మండలిపై ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఇక ఫెడరేషన్ కూడా కార్మికుల వేతనాల  అంశాన్ని సాగదీస్తూ వచ్చిన విషయం తెలిసిందే కదా.

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌కు భారీ షాక్‌ ఇచ్చిన టీఆర్పీ రేటింగ్స్.. నాగార్జునకు మరో ఘోర అవమానం..

అంతేకాదు జీతాలు పెంచేవరకు సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ వారు షూటింగ్‌కు రాకూడదని ఫెడరేషన్ మీద ఒత్తిడి చేయడానికీ 24 యూనియన్ సభ్యులు జూన్ 22న   ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడి చేసారు. ఇక వేతానాలు పెంచే వరకు 24 క్రాఫ్ట్స్ ఎవరు షూటింగ్‌లో పాల్గొనబోమని అప్పట్లో ప్రకటించారు. మొత్తంగా సినీ కార్మికుల సమ్మెతో దిగి వచ్చిన నిర్మాతల మండలి ఇపుడు కార్మికులు వేతనాలు పెంచడం గమనార్హం.  .

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Telugu Film Producers Council, TFCC, Tollywood

ఉత్తమ కథలు