హోమ్ /వార్తలు /సినిమా /

ఆ పుకార్లను నమ్మకండి.. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్..!

ఆ పుకార్లను నమ్మకండి.. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్..!

తెలుగు ఫిల్మ్ చాంబర్

తెలుగు ఫిల్మ్ చాంబర్

షూటింగ్స్ ను, సినిమా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించవచ్చని నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో తెలిపారు.

  తెలుగు చలన చిత్రరంగంలో సినిమా టికెట్ల రేట్ల గురించికానీ, 24 శాఖల కార్మికుల సమస్యలపై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తీసుకున్న నిర్ణయాలు అంటూ ఏదైనా వార్తలు ఎక్కడ ప్రచురితమైనా అవి తమకు సంబంధంలేనివనీ, వాటిని నమ్మవద్దని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ స్పష్టం చేసింది.

  కొవిడ్ అనంతరం కొన్ని సినిమాలకు మాత్రమే ప్రేక్షకాదరణ లభించింది. చాలా సినిమాలకు థియేటర్లలో స్పందన కరువు అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ను నిలిపివేసి  ఓసారి పరిస్థితులను పునః సమీక్షించుకోవడం మంచిదని రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే… కరోనా కష్టాలను అధిగమించి ఇప్పుడిప్పుడే సినిమా రంగం గాడిన పడుతున్న సమయంలో ఇలా షూటింగ్స్ బంద్ చేస్తే అసలుకే ఎసరు పెట్టినట్టు అవుతుందని మరికొందరు వాదిస్తున్నారు.

  ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి సోమవారం మరోసారి సమావేశం కాబోతోంది. అలానే ఈ నెల 26వ తేదీ మంగళవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తన నాలుగు విభాగాల (నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్, స్టూడియో నిర్వాహకులు) తో సమావేశం కానుంది. ఆ సమావేశంలోని అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి, ఓ నిర్ణయానికి రాబోతోంది. అప్పటి వరకూ నిర్మాతలంతా సహనంతో ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మొద్దని, షూటింగ్స్ ను, సినిమా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించవచ్చని నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో తెలిపారు.

  మరోవైపు 68వ జాతీయ సినీ అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’, ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్, నృత్య దర్శకురాలిగా సంధ్యారాజ్, ఉత్తమ మేకప్ మ్యాన్ గా టి.వి. రాంబాబు ఎంపికైన విషయం తెలిసిందే. వీరందరికీ తెలుగు నిర్మాతల మండలి అభినందనలు తెలియచేసింది. అలానే ఉత్తమ నటుడిగా ఎంపికైన సూర్యకు, ఆయన నటించి నిర్మించిన ‘సూరారై పోట్రు’ బృందానికి, ఇతర అవార్డుల విజేతలకు శుభాభినందనలు తెలిపింది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Film chamber, Tollywood

  ఉత్తమ కథలు