పునర్నవిలో ఆ స్పెషాలిటీ ఉందన్న దర్శకుడు వర్మ

సినిమా విడుదల తరువాత చాలా మంది కాల్ చేసి పునర్నవి గురించి తనకు అడిగారన్నారు ఆ దర్శకుడు.

news18-telugu
Updated: November 19, 2019, 12:30 PM IST
పునర్నవిలో ఆ స్పెషాలిటీ ఉందన్న దర్శకుడు వర్మ
పునర్నవి హాట్ ఫోటో షూట్ Photo: Instagram/punarnavib
  • Share this:
'బిగ్ బాస్ 3' రియాలిటీ షోతో పునర్నవి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది పునర్నవి భూపాలం. అయితే అప్పట్లో ఆమె వయసు చాలా తక్కువ కావడంతో... అటు చదవును కొనసాగిస్తూ...పెద్గగా కెరియర్‌పై దృష్ట పెట్టలేకపోయింది. తాజాగా బిగ్ బాస్ షోతో పునర్నవి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పునర్నవి పాల్గొంది. ఈ సందర్భంగా 'ఉయ్యాలా జంపాలా' దర్శకుడైన 'విరించి వర్మ' పునర్నవి గురించి పలు ఆసక్తికర విషయాాలు చెప్పారు.

'ఉయ్యాలా జంపాలా' ఆడిషన్స్ కోసం వచ్చినప్పుడు పునర్నవిని మొదటిసారిగా చూశానన్నారు.ఒక సీన్‌కి సంబంధించిన పేపర్ ఇచ్చి డైలాగ్స్ చెప్పామన్నానని తెలిపారు. అయితే ఆ డైలాగ్‌ను పునర్నవి చాలా నేచురల్‌గా చెప్పేసిందన్నారు. ఈ అమ్మాయి ఈ పాత్రకి కరెక్ట్ గా సరిపోతుందనీ సినిమాలో తీసుకున్నామన్నారు. మంచి భవిష్యత్తు ఉంటుందని అప్పుడే అనుకున్నానన్నారు వర్మ. సినిమా విడుదల తరువాత చాలా మంది కాల్ చేసి పునర్నవి గురించి తనకు అడిగారన్నారు. ఆడిషన్స్ లో కంటే కెమెరా ముందుకు వచ్చినప్పుడు బాగా చేస్తుంది. అలాగే డబ్బింగ్ కూడా తను చాలా బాగా చెబుతుంది. ఇలా తన పాత్రకు తనే మెరుగులు దిద్దుకుంటూ వస్తుంది .. అదే ఆమె ప్రత్యేకత" అని పునర్నవిని పొగడ్తల్లో ముంచెత్తేశారు విరంచి వర్మ.
First published: November 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading