కళాఖండం ‘శంకరాభరణం’‌కు ఈరోజుతో 40 సంవత్సరాలు పూర్తి..

తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’ ఈరోజుతో 40 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుంది.

news18-telugu
Updated: February 2, 2020, 8:56 AM IST
కళాఖండం ‘శంకరాభరణం’‌కు ఈరోజుతో 40 సంవత్సరాలు పూర్తి..
శంకరాభరణంలో ఓ సీన్.. Photo : Twitter
  • Share this:
తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. ఈ సినిమా ఫిబ్రవరి 2 , 1980లో విడుదలై ప్రపంచ నలు మూలల్లో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎవరి నోట విన్నా ‘శంకరాభరణం’ గురించే ప్రస్తావనే. ఈ సినిమా విడుదలై ఈరోజుతో 40 సంవత్సరాలు పూర్తవుతుంది. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఈ సినిమాలో శంకరశాస్త్రి, తులసి మధ్య అలవికాని అనుబంధం తెలుగువారినే కాకుండా పక్క రాష్ట్రాల్లో ప్రజల్నీ కూడా మెప్పించింది. ఈ సినిమా ప్రభావితంతో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు . తెలుగోడు ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవాడు. స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ సినిమాకు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకు బెస్ట్ సింగర్‌గా తొలి సారి జాతీయ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు శ్రీమతి వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కె.వి.మహదేవన్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు దక్కాయి.

Telugu classic shankarabharanam completes 40 years
శంకరాభరణంలో మంజు భార్గవి Photo : Twitter


కథ విషయానికి వస్తే ఓ వేశ్యకు ఆశ్రయం ఇస్తాడు ఈ సినిమా కథానాయకుడు శంకరశాస్త్రి. దీనికి తోడు పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరవై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరోవైపు తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి (వేశ్యా) బిడ్డకు జన్మనిస్తుంది. చివరకు వేశ్యా కొడుకే శంకరశాస్త్రి సంగీత వారసుడవుతాడు. విశ్వనాథ్ దర్శకత్వంలో పాటు ఈ సినిమాకు కె.వి. మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిస్తే.. జంధ్యాల మాటలు, జేవీ సోమయాజులు (శంకరశాస్త్రి), మంజుభార్గవి, అల్లు రామలింగయ్యల నటన ‘శంకరాభరణం’ను ఓ కళాఖండంగా మార్చాయి.

First published: February 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు