Home /News /movies /

దిల్ రాజు నిర్మాణంలో హిట్ హిందీ రీమేక్.. హీరోగా విలక్షణ నటుడు..

దిల్ రాజు నిర్మాణంలో హిట్ హిందీ రీమేక్.. హీరోగా విలక్షణ నటుడు..

దిల్ రాజు, హిట్ సినిమా పోస్టర్ Photo : Twitter

దిల్ రాజు, హిట్ సినిమా పోస్టర్ Photo : Twitter

Hit Hindi Remake : యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా కొత్త డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్.

    ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గర్తింపు తెచ్చుకున్న యువ హీరో విశ్వక్ సేన్. ఆయన హీరోగా కొత్త డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్. హీరో నాని నిర్మాణంలో రెండో చిత్రంగా వచ్చిన ఈ హిట్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. విమర్శకుల ప్రశంసల్నీ దక్కించుకుంది. ఈ సినిమాలో హీరో విశ్వక్ ఇంటెలిజెంట్ పోలీసు ఆఫీసర్‌గా అదరగొట్టాడు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనీ భావించారు. కానీ దానికి సంబందించిన ఎటువంటీ ప్రకటన విడుదలకాలేదు. దీంతో అందరూ ఇది జస్ట్ రూమర్ అంటూ వదిలేశారు. కానీ తాజాగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన రావడం జరిగింది. హిందీ హిట్‌లో విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కనుంది. రాజ్ కుమార్ రావ్.. ఎప్పటికప్పుడు కొత్త కథలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలో న్యూటన్, స్త్రీ, జడ్జ్ మెంటల్ హే క్యా.. వంటీ సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకన్నాడు.

    ఇక ఈ సినిమాలను తెలుగులో తెరకెక్కించిన శైలేష్ కొలను హిందీ రీమేక్ కి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఇక మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ఇక ఇప్పటికే నాని హీరోగా తెరకెక్కిన 'జెర్సీ' మూవీని షాహిద్ కపూర్ తో హిందీలో రీమేక్ చేస్తున్న దిల్ రాజు.. ఈ సినిమాను కూడా నిర్మించడం విశేషం.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bollywood news, Dil raju, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు