TELUGU BIGG BOSS SEASON 5 LIST IS HERE VARSHINI ANCHOR RAVI NAVYA SWAMY ALSO HERE NR
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. ఈసారి షోలో మాములు రచ్చ ఉండదుగా!
bigg boss season 5 telugu
Bigg Boss 5 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం భాషలలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
Bigg Boss 5 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం భాషలలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తికాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక త్వరలో సీజన్స్ 5 కూడా ప్రారంభం కానుంది. దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు ఎవరా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపించాయి.
గత సీజన్ లో ఎక్కువ బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలను పరిచయం చేయగా.. కొంతవరకు సోషల్ మీడియా సెలబ్రిటీలను పరిచయం చేశారు. ఇక ఈ సీజన్ లో ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీలను తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కానీ ఇంతవరకు పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే క్లారిటీ మాత్రం రాకపోగా..స్ట్రాంగ్ కంటెస్టెంట్ లను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. తాజాగా కొందరి కంటెస్టెంట్ ల లిస్ట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ లిస్టులో ఎవరున్నారంటే..
యాంకర్ రవి, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, జబర్దస్త్ గెటప్ శీను, గ్లామర్ యాంకర్ వర్షిణి, రఘు మాస్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, బుల్లితెర నటి సిరి, లోబో, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, టీవీ9 ప్రత్యూష, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంట ల పేర్లు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఇక ఈ సీజన్ ను స్టార్ మా మరింత రెట్టింపు బడ్జెట్ తో ప్లాన్ చేసిందని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేశారట. టాస్క్ లు కూడా అంతే రేంజ్ లో ఉంటాయని.. ఈ సీజన్ కోసం మేకర్స్ కూడా బాగా కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సీజన్ కు హోస్టింగ్ గా నాగార్జున పేరు వినిపించగా.. ఇటీవలే మరో నటుడు రానా హోస్టింగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కానుందని తెలుస్తుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.