హోమ్ /వార్తలు /సినిమా /

రాజకీయాల్లోకి వస్తానంటున్న సూపర్ స్టార్ కూతురు

రాజకీయాల్లోకి వస్తానంటున్న సూపర్ స్టార్ కూతురు

వరలక్ష్మి శరత్ కుమార్ Photo: Instagram/varusarathkumar

వరలక్ష్మి శరత్ కుమార్ Photo: Instagram/varusarathkumar

తమిళ తెలుగు హీరో విశాల్, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఆ మధ్య వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించాయి. అయితే తాజగా విశాల్ తన పెళ్లి అనీషా రెడ్డితో జరుగుతుందని ప్రకటించాక..వరలక్ష్మితో పెళ్లిలో నిజం లేదని తేలిపోయింది. ఇంతలో వరలక్ష్మీ మరో సంచలన నిర్ఱయం తీసుకుంది.

ఇంకా చదవండి ...

  పందేంకోడి-2 సినిమాలో విలన్ క్యారెక్టర్‌‌లో మెరిసిన వరలక్ష్మి శరత్ కుమార్..తన నటనతో తెలుగు వారిని భాగానే ఆకట్టుకుంది. వరలక్ష్మి ఇంతకు ముందు విజయ్ సర్కార్ సినిమాలోను..పలు తమిళ సినిమాల్లో కూడా హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో లేడీ విలన్‌గా అదరగోడుతుంది. అందులో భాగంగా ఆమె విశాల్ పందేంకోడి 2లో విలన్‌‌‌‌గా చేసింది తెలిసిందే. అంతేకాకుండా.. ఆమె ‘కన్నిరాశి, ‘వెల్వట్‌ నగరం’, ‘నీయా 2’, ‘కాట్టేరి’, తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఆమె తాజా నిర్ణయం తమిళ ప్రేక్షకుల్నీ షాక్ గురిచేసింది. వరలక్ష్మి ఈ మధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందనీ...అందులో భాగంగా ‘రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నానని... మంచి అవగాహన వచ్చాకా..రాజకీయాలు భాగా నేర్చుకున్న తర్వాత మంచి సమయంలో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను అని తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలను సరైన విధంగా వినియోగించుకోవాలి. రాజకీయాలంటే ఏదో చెడ్డ విషయం కాదు. ప్రజలకు మేలు చేయగలిగే ఓ చక్కని వేదిక. ఇప్పుడున్న పరిస్థితుల్లో విప్లవం చాలా ముఖ్యం. ప్రస్తుతానికి మా నాన్న నడుపుతున్నా రాజకీయ పార్టీకి, నాకు ఎలాంటి సంబంధం లేదని’ అని అన్నారు.


  Photos: రాశీఖన్నా లేటెస్ట్ హాట్ ఫోటోస్

  First published:

  Tags: Tamil Cinema, Tamil Film News, Tamil News

  ఉత్తమ కథలు