నిత్యా మీనన్‌‌‌తో ఉన్నది ఎవరు..! అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న ఆ ఫోటో

నిత్యా మీనన్.. నటుడు నాని 'అలా మొదలైంది' సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా నటించింది. అయితే సినిమాల్లో నటించడమే కాకుండా.. నిత్యలో మరో కోణం ఉంది.

news18-telugu
Updated: March 16, 2019, 5:05 AM IST
నిత్యా మీనన్‌‌‌తో ఉన్నది ఎవరు..! అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న ఆ ఫోటో
నిత్యా మీనన్‌‌లో మరో కోణం
news18-telugu
Updated: March 16, 2019, 5:05 AM IST
నిత్యా మీనన్.. నటుడు నాని 'అలా మొదలైంది' సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది తెలిసిందే. అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసింది. అయితే అవి బాక్సాఫీసు వద్ద అంతగా.. ఆడలేదు. కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత.. మళ్లీ నితిన్‌తో జతకట్టి.. గుండెజారి గల్లంతయ్యిందే సినిమా చేసింది. నిత్య తెలుగు సినిమాలతో పాటు, అటు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది.  అయితే.. నిత్యా మీనన్‌‌లో మరో కోణం ఉంది..ఆమె చాలా స్పిరిచ్యువల్ ఇది చాలా మందికి తెలియదు. ఆమె పని చేసేది గ్లామర్ ఫీల్డ్‌లో అయినా భక్తి ఎక్కువే. అందుకే, 'వన్ నెస్ యూనివర్సిటీ' అనే ఆధ్యాత్మిక సంస్థతో నిత్యకు మంచి అనుబంధం ఉంది. ప్రపంచ మానవులంతా ఒక్కటే అని బోధించే 'వన్ నెస్ యూనివర్సిటీ' సమావేశాలు, కార్యక్రమాలకు అప్పుడప్పుడు నిత్య వెళుతుంటుంది.

Photo: Twitter/@MenenNithya
నిత్యా మీనన్ Photo: Twitter/@MenenNithya


అలా అక్కడ ఆమెకు చాలా మంది విదేశీయులతో అనుబంధం ఏర్పడింది. ఆ కారణంతోనే, ఓ యంగ్ అండ్ హ్యాండ్సమ్‌ని టైట్‌గా హగ్ చేసుకుని ఫోటో తీయించుకుంది. అంతేకాకుండా ఆ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ కూడా చేసి.. 'ఫ్రెండ్స్, లవ్ అండ్ హ్యాపీనెస్' అని రాసింది. దీంతో నిత్య అభిమానుల్లో కలకలం మొదలైపోయింది! ఇంతకీ, నిత్యతో ఫోటో దిగిన ఆ విదేశీయుడు ఎవరు? అని ఆరా..తీయగా.. అతని పేరు ఓలివర్.. అని.. హాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడని తెలిసింది. అయితే.. మనోడు చాలా యంగ్. ఈ విషయం నిత్య మీననే చెప్పింది. తను పోస్టు చేసిన హగ్గింగ్ ఇమేజ్‌ను చూసి గగ్గోలు పెడుతోన్న నెటిజన్స్‌తో ఆమె అసలు విషయం కుండ బద్ధలు కొట్టింది. ''తన పేరు ఓలివర్... నా ఫ్రెండ్, లిటిల్ బ్రదర్'' అని చెప్పింది. అంతేకాకుండా.. తనకు అటు ఇటుగా 18 ఏళ్లు ఉంటాయని కూడా ప్రకటించింది. దీంతో అసలు విషయం తెలుసుకున్న అభిమానులు ఒహ్ ఇంతేనా..అని నిట్టూర్చినట్టైంది.

Loading...

రకుల్ ప్రీత్ సింగ్ హాట్ లేటెస్ట్ ఫోటోస్
First published: March 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...