Home /News /movies /

TELUGU AND TAMIL ACTRESS PRIYAMANI WILL BE SEEN IN A TELUGU MOVIE AFTER SOMANY YEARS SR

సిరివెన్నెలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నటి ప్రియమణి

(Image: Twitter)

(Image: Twitter)

ప్రియమణి..ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇరగదీసింది. అంతేకాదు..ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఆమె గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

    ప్రియమణి..ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇరగదీసింది. అంతేకాదు..ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. కోలీవుడ్, టాలీవుడ్ పలు కమర్షియల్ చిత్రాల్లో నటించిన ప్రియమణి బాలీవుడ్‌లో కూడా షారూఖ్ ఖాన్ సరసన చిందేసింది. అయితే.. ఆమె కొన్ని కేసులలో ఉందని ఆరోపణలు రావడం..అంతేకాకుండా ఆమె పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు కాస్త దూరమైన ప్రియమణి ఈ మధ్య టీవీ షోల రూపంలో టాలీవుడ్‌తో టచ్‌లోనే ఉంటుంది.

    ఇప్పుడు తాజాగా ఓ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఏఎన్‌బి కోర్డినేటర్స్ బ్యానర్‌పై ఏ‌ఎన్‌భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేస్తోంది. ఈ సినిమాకు క్లాసిక్ మూవీగా చెప్పుకునే ‘సిరివెన్నెల’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఆమె కీలకపాత్ర పోషించనుంది. దానికి సంబంధించి చిత్రం యూనిట్ ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో
    ప్రియమణి మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. నాకోసం ముంబై వచ్చి కథ చెప్పారు. థ్రిల్లర్ జోనర్ అయినప్పటికీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటూ.. సూపర్ నేచురల్ సంబంధ విషయాలు నేర్చుకునే ప్రాసెస్‌లో కొన్ని సంఘటనలు జరుగుతాయని.. చిత్ర విశేషాలను తెలియజేశారు.


    First published:

    Tags: Telugu Cinema, Telugu Movie News

    తదుపరి వార్తలు