యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు.. ప్రముఖ యాంకర్ సుమ గ్రీన్ ఛాలెంజ్ విసిరింది. ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు మొక్కలు నాటి .. ఇద్దరికో ముగ్గురికో మొక్కలు నాటమని గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నారు. తాజాగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ సుమ.. జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ ఛాలెంజ్ విసిరింది. అది కూడా చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలోని డైలాగ్ చెప్పి మరీ.. ఎన్టీఆర్‌కు సుమ ఈ ఛాలెంజ్ విసరడం విశేషం. స్టాలిన్ సినిమాలో నువ్వు ముగ్గురికి సాయం చేయి.. ఆ ముగ్గురు ముగ్గురేసి చెప్పున సాయం చేయమంటారు. అలాగే సుమ.. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ భాగంగా ఛాలెంజ్ విసిరింది. ఇక యాంకర్ సుమకు ప్రముఖ నటి జయసుధ, యాంకర్ అనసూయ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన సుమ.. తన ఇంట్లో మొక్కలను నాటింది. ఈ సందర్భంగా సుమ.. జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మీ, బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ రాహుల్, డైరెక్టర్ కమ్ యాంకర్ ఓంకార్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్‌తో కాలుష్యం తగ్గడంతో పాటు భావి తరాలు బాగుపడాతయని పేర్కొంది.
Accepted #greenindiachallenge from#jayasudha garu n @anusuyakhasba planted 3 saplings n now invite @tarak9999 @Rahulsipligunj @LakshmiManchu & #anchoromkar to plant 3 🌱& continue the chain 🌱🌳 thanks to @MPsantoshtrs for great intiate for climate change pic.twitter.com/sVD42YF8Qm
— Suma Kanakala (@ItsSumaKanakala) November 13, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Bigg Boss 3, Jr ntr, Rahul sipligunj, Telugu Cinema, Tollywood