TELUGU ANCHOR SREEMUKHI USING ALIEN EFFECT IN INSTAGRAM REEL VIDEOS GOES VIRAL ON INTERNET NR
Anchor Sreemukhi: ఈతకల్లు తాగిన యాంకర్ శ్రీముఖి.. చివరికి ఏలియన్గా మారిపోయి?
Anchor Sreemukhi
Anchor Sreemukhi: బుల్లితెర గ్లామర్ యాంకర్ శ్రీముఖి. ఈమె పరిచయం గురించి టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. కెరీర్ మొదట్లో అదుర్స్, సూపర్ సింగర్ 9 షోలలో యాంకరింగ్
Anchor Sreemukhi: బుల్లితెర గ్లామర్ యాంకర్ శ్రీముఖి. ఈమె పరిచయం గురించి టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. కెరీర్ మొదట్లో అదుర్స్, సూపర్ సింగర్ 9 షోలలో యాంకరింగ్ చేసి.. వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంది. పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత యాంకర్ రవితో కలిసి పటాస్ షో లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినీ అవార్డు ఫంక్షన్ లలో కూడా హోస్టింగ్ చేస్తుంది శ్రీముఖి.
నిజానికి వెండితెర కంటే బుల్లితెరపై ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ఈ గ్లామర్ బ్యూటీ. అంతేకాకుండా బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొని హౌస్ లో చివరి వరకు ఉండి తనేంటో నిరూపించుకొని రన్నరప్ గా నిలిచింది. ఇక తెరవెనుక శ్రీముఖి బాగా సందడి చేస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి తెగ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. ఈమధ్య ఏలియన్ ఫిల్టర్ లతో కామెడీ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది. అందులో ఓ ఫిల్టర్ తో ఓ ఫన్నీ వీడియో పంచుకుంది. అంతేకాకుండా షార్ట్ బ్రేక్ లో కొన్ని ఓవర్ యాక్షన్ లు అంటూ తన వీడియోకి క్యాప్షన్ ఇచ్చుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.