Home /News /movies /

TELUGU ANCHOR SHYAMALA ABOUT HER MOTHER STRUGGLES IN OLD DAYS NR

Anchor Shyamala: తండ్రి మరణం ఒంటరైన తల్లిని ఆకతాయిలు అలా అంటూ యాంకర్ శ్యామల ఎమోషనల్..!

Anchor Shyamala

Anchor Shyamala

Anchor Shyamala: బుల్లితెర యాంకర్ శ్యామల పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెర లో కూడా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.

    Anchor Shyamala: బుల్లితెర యాంకర్ శ్యామల పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెర లో కూడా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్యామల. ఇదిలా ఉంటే మదర్స్ డే రోజు శ్యామల తన తల్లి గురించి కొన్ని ఎమోషనల్ విషయాలు పంచుకుంది.



    ప్రపంచ మాతృ దినోత్సవం తన అమ్మ పడిన కష్టాల గురించి, తన అమ్మ గురించి అభిమానులతో పంచుకుంది. తను చెప్పిన మాటలు ఎంతో మంది హృదయాలను కదిలించాయి. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తల్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన అమ్మకు 40 ఏళ్ళు వచ్చాక తను పుట్టిందట. ఇక ఆ తర్వాత తను ఏడాది వయసు వచ్చాక తన తండ్రి చనిపోయాడట‌. ఇక అప్పటి నుంచి తన అమ్మే తనను పెంచారట‌. తమకు ఎంతో మంది బంధువులు ఉన్న కూడా ఎవరి సహాయం చేయడానికి ముందుకు రాలేదని.. అందులో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అంటూ తెలిపింది శ్యామల.



    తనకు ఆ సమయంలో జ్వరం వచ్చి ఏడుస్తున్నా కూడా.. హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి ఎవరు కూడా సహాయం చేయలేదంటూ.. పైగా తమ బంధువులను తన సహాయం అడిగితే చుట్టూ పర్దా కట్టుకొని ఓ రిక్షా ను తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి తీసుకరాని సలహా ఇచ్చారట. అలా తమ బంధువులు కూడా తమకు దూరంగా ఉండే వాళ్ళని, కానీ తన తల్లి వాళ్ళకి ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతూనే ఉంటుందని తెలుపుకొచ్చింది.



    ఎందుకంటే వాళ్ళు ఆ రోజు అలా చేయటంతో.. తన తల్లికి ధైర్యం, తెగువ వచ్చిందంటూ తెలిపింది. ఇక తన తల్లి నర్సుగా పని చేసేవారట. ఎంత దూరమైనా సైకిల్ మీద వెళ్లేవారట. అప్పుడప్పుడు తను కూడా తల్లితో వెళ్లేదట‌. అలా ఓసారి వెళ్లి తిరిగి వస్తున్న రాత్రి సమయంలో కొంతమంది తన అమ్మ వెనకాల వచ్చారని, తన అమ్మని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారట. కానీ తన తల్లి మాత్రం వారికి ధైర్యం తో కూల్ గా సమాధానం చెప్పేసిందట. వాళ్ళను దగ్గరికి పిలిచి నీకేం కావాలి అంటూ, తన వయసు 44, 45 ఉంటుందని.. మీ అమ్మ వయసు లాంటిది అంటూ.. మీకు ఇది పద్దతిగా ఉందా అంటూ క్లాస్ పీకారంటా. ఇక అప్పటి నుంచి వాళ్లే తన తల్లికి బాడీగార్డ్ ల ఉంటూ, ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అంటూ అనేవారట. ఇలా మరికొన్ని విషయాలను పంచుకున్న శ్యామల అందరి మనసులను కదిలించింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anchor Shyamala, Emotional video, Mothers day, Shyamala, Syamala anchor, యాంకర్ శ్యామల, శ్యామల

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు