Akkineni Nagarjuna - Rashmi Gautam: బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఓ సొంత క్రేజ్ ను సంపాదించుకున్న నటి రష్మీ గౌతమ్. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా బుల్లితెర లో మరిన్ని షోలలో కూడా బాగా సందడి చేస్తుంది రష్మీ. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ అందుకొంది రష్మీ.
జబర్దస్త్ కు ముందే రష్మీ వెండితెరపై మెప్పించింది. పలు సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించింది. కానీ అంత గుర్తింపు తెచ్చుకోలేదు. ఇక జబర్దస్త్ తర్వాత మంచి ఫాలోయింగ్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఓ సినిమాలో కీలక పాత్రలో నటించింది కానీ జబర్దస్త్ లో వచ్చిన క్రేజ్ మాత్రం వెండితెరపై అందుకోలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న ఓ డాన్స్ షోలో కూడా టీమ్ లీడర్ గా పనిచేస్తుంది.
ఇక త్వరలోనే స్టార్ హీరో సినిమాలో నటించనుంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో హీరో నాగార్జున నటిస్తున్న సినిమాలో ఆఫర్ అందుకుంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఓ కీలక పాత్రలో రష్మీ కనిపించనుందట. శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగా సెకండ్ షెడ్యూల్ కు సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడగా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. సెకండ్ షెడ్యూల్ లో రష్మీ జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రష్మీ పాత్ర ఏంటో త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Nagarjuna Akkineni, Praveen Sattaru, Rashmi Gautam, Telugu anchor, Tollywood, జబర్దస్త్ కామెడీ షో, బుల్లితెర యాంకర్, రష్మీ గౌతమ్, హీరో నాగార్జున