Anchor Rashmi: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ మంచి ఫాలోయింగ్ అందుకుంది. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా యువతను బాగా ఆకట్టుకుంటుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. కానీ తనకంటూ క్రేజ్ మాత్రం బుల్లితెర పైనే సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు, వీడియోల షేర్ లతో బాగా బిజీగా ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా రష్మీ కి మంచి పేరు ఉంది. సమాజంలో జరిగే వాటి గురించి బాగా స్పందిస్తుంది. ఇదిలా ఉంటే ఎక్స్, ప్రెసెంట్ తో బాగా ఎంజాయ్ చేస్తుంది రష్మీ.
రష్మీ కి బుల్లితెరలో ఇంత క్రేజ్ రావడానికి కారణం.. మరో కమెడియన్ సుడిగాలి సుధీర్ అనే చెప్పాలి. ఎందుకంటే అతడితో సన్నిహితంగా ఉంటూ మరింత క్రేజ్ సంపాదించుకుంది. పైగా అతనితో ప్రేమాయణంలో ఉన్నట్లు తెగ వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా అతనితో రొమాన్స్ చేస్తూ బాగా రెచ్చిపోతుంది. ఇక ఈ విషయం గురించి చాలా సార్లు ప్రశ్నలు ఎదురవ్వగా.. కేవలం రేటింగ్ కోసం అలా చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram
ఇక జబర్దస్త్ తో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో టీమ్ లీడర్ గా చేస్తుంది రష్మీ. ఇందులో మరో సోషల్ మీడియా స్టార్ దీపిక పిల్లితో కలిసి చేయగా.. ఇందులోనే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లతో జంటలుగా కలిసి బాగా రచ్చ చేస్తుంటారు. ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది. అందులో తను అందరికీ సర్ ప్రైజ్ అంటూ.. ఇక్కడ నా ఎక్స్, ప్రెసెంట్ వాళ్ళతో ఉన్నానంటూ సర్ ప్రైజ్ వీడియో చేస్తూ దీపిక పిల్లిని, తన ఫ్రెండ్ లను చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా ఈ వీడియోని చూసిన సుధీర్ అభిమానులు ఇంత షాక్ ఇచ్చావేంటి రష్మీ అంటూ.. మరి సుధీర్ పరిస్థితి ఏంటి అని.. తమ ప్రేమాయణం గురించి ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi, Anchor varshini, Deepika pelli, Dhee show, Sudigali sudheer