Anchor Prashanthi: బుల్లితెరలో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఇక ఈ సీరియల్ లో నటించే నటీనటుల పాత్రల గురించి అందరికి తెలిసిందే. ఇందులో నందుకి రెండవ భార్యగా నటిస్తున్న లాస్య పాత్ర నెగిటివ్ గా ఉన్నాకూడా తన నటనకు మాత్రం మంచి గుర్తింపు అందుకుంది.
Anchor Prashanthi: బుల్లితెరలో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఇక ఈ సీరియల్ లో నటించే నటీనటుల పాత్రల గురించి అందరికి తెలిసిందే. ఇందులో నందుకి రెండవ భార్యగా నటిస్తున్న లాస్య పాత్ర నెగిటివ్ గా ఉన్నాకూడా తన నటనకు మాత్రం మంచి గుర్తింపు అందుకుంది. లాస్య అసలు పేరు యాంకర్ ప్రశాంతి. ఒకప్పుడు టీవీ యాంకర్ గా పరిచయమైన ప్రశాంతి సీరియల్ వైపు అడుగు పెట్టింది. ఇక ఈమె అవకాశాల లేనందున ఓ ఎమోషనల్ కామెంట్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారి కంటే బయట వారికి ఎక్కువ అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంతి కూడా తెలుగు ఇండస్ట్రీ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. తెలుగు వాళ్లలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారని.. తెలుగు వాళ్లు బయట రాష్ట్రాలలో అవకాశాలకోసం ప్రయత్నిస్తే వాళ్ళు తెలుగువారిని తీసుకోరు.. కానీ బయట వారిని మాత్రం తెలుగు ఇండస్ట్రీ బాగా ఎంకరేజ్ చేస్తారని తెలిపింది.
తను ప్రస్తుతం ఇలా మాట్లాడడానికి కారణం తనను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారని అన్నారట. కానీ లీడ్ రోల్స్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించడంతో తనకు కూడా ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుందని తెలిపింది. ఈరోజు తనకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రశ్నిస్తున్నాను అని తెలిపింది. తెలుగు వాళ్లలో చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ఉన్నారని.. వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒక్కొక్కరు ఆణిముత్యాలే అవుతారని తెలిపింది. కానీ అవకాశం లేక చాలా మంది తమ టాలెంట్‌ను చంపుకుంటున్నారని, అలా అవకాశాలు లేక చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్తుంటారని తెలిపింది. ఇవన్నీ ఒక్కొక్కసారి చూస్తుంటే తనకు కూడా బాధ అనిపిస్తుంది అని తెలిపింది ప్రశాంతి.
నిజంగా వాళ్ళని చూస్తే ఏం కామెంట్ చేయాలో తెలియదని ఎమోషనల్ గా తెలిపింది. ఇక మన వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అంటూ గట్టిగా తెలిపింది. బయట వాళ్ళు బయట వాళ్లే.. మన వాళ్ళు మన వాళ్లేనని అంటుంది ప్రశాంతి. ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు ఎమోషనల్ అవ్వాల్సి వస్తుందని.. అయినా కూడా మన వాళ్ళు పట్టించుకోరని తన మనసులో మాటలను బయటపెట్టింది ప్రశాంతి.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.