TELUGU ANCHOR PRADEEP INTRESTING COMMENTS ON NANDAMURI BALAKRISHNA IN DRAMA JUNIORS NR
Anchor Pradeep: బుల్లితెరపై బాలయ్య.. ఒక్క ఫోన్ కాల్ అంటూ యాంకర్ ప్రదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Anchor pradeep
Anchor Pradeep: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు పరిచయం గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ మొదట్లో రేడియో జాకీగా పనిచేసిన ప్రదీప్.. ఆ తర్వాత టాలీవుడ్ బుల్లితెర, వెండితెరపై అడుగుపెట్టాడు. పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Anchor Pradeep: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు పరిచయం గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ మొదట్లో రేడియో జాకీగా పనిచేసిన ప్రదీప్.. ఆ తర్వాత టాలీవుడ్ బుల్లితెర, వెండితెరపై అడుగుపెట్టాడు. పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా బుల్లితెరలో గడసరి అత్త సొగసరి కోడలు షోలో యాంకర్ గా చేసి ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా బుల్లితెరపై ఎన్నో షోలలో అవకాశాలు అందుకున్నాడు. స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగులో ఎన్నో షో లతో పాటు పలు బుల్లితెర, వెండితెర ఈవెంట్లలో కూడా బాగా సందడి చేశాడు. ఇక ప్రస్తుతం ఢీ షోతో పాటు జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ లో కూడా హోస్టింగ్ చేస్తూ పిల్లలతో పాటు బాగా సరదా చేస్తుంటాడు. ఇక ఈయనకు ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. ఇక తాజాగా ఢీ జూనియర్స్ సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో బాలయ్య గురించి కొన్ని కామెంట్స్ చేశాడు ప్రదీప్.
ఇందులో సింగర్ సునీత, ఎస్వీ కృష్ణారెడ్డి, ఆలీ జడ్జ్ లుగా చేస్తున్నారు. ఇక ఈ వారం ఇందులో సినీ నటుడు బాబు మోహన్ గెస్ట్ గా పాల్గొని ఎంట్రీతో బాగా రచ్చ చేశాడు. ఇక పిల్లలు తమ పర్ఫామెన్స్ లతో బాగా ఆకట్టుకున్నారు. ఇందులో ఎప్పుడూ బాలకృష్ణ లుక్ తో అలరించే ప్రజ్వాల్ ఈసారి తన పెర్ఫార్మెన్స్ తో మరింత నవ్వించాడు.
ఇక బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా అభిమానుల హృదయాల్లో నిలిచాడు. ఇందులో స్కిట్ లో భాగంగా బాలయ్య దగ్గరికి సహాయం కోసం వచ్చిన ఒక మహిళకు వెంటనే తన వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఇక బాలయ్య గురించి పొగుడుతూ.. ఆయన ఫోటోను వేదికపైకి తీసుకొని రాగా.. వెంటనే ప్రదీప్ బాలయ్య గురించి కొన్ని కామెంట్స్ చేశాడు.
https://youtu.be/1sE_CU0iwDU
ఆయన స్టైల్, ఆయన తీరు ఎప్పుడు సింహంలా ఉంటుందని అన్నాడు. ఇక క్యాన్సర్ హాస్పిటల్ లోనే కాకుండా మరెక్కడైనా ఏదైనా సహాయం కావాలి అంటే మొదట బాలయ్యకే ఫోన్ చేస్తానని తెలిపాడు ప్రదీప్. అలా ఎంతో మందికి సహాయం చేశాడని.. అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చెయ్ అని బాలయ్య అనడంతో ఒక్క మాటకే చాలా ధైర్యమని తెలిపాడు ప్రదీప్. ఇక ఆలీ, బాబు మోహన్ కూడా బాలయ్య గురించి తెగ పొగిడారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.