హోమ్ /వార్తలు /సినిమా /

Rambha: హీరోయిన్ రంభకు యాక్సిడెంట్.. పిల్లలతో పాటు వెళ్తుంటే.. ప్రమాదం..!

Rambha: హీరోయిన్ రంభకు యాక్సిడెంట్.. పిల్లలతో పాటు వెళ్తుంటే.. ప్రమాదం..!

రంభ కారుకు ప్రమాదం

రంభ కారుకు ప్రమాదం

మంగళవారం యాక్సిడెంట్‌కు గురి అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, వారిని చూసుకునే ఆయా ఉన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ ఒకప్పటి స్టార్‌ హీరోయిన్ రంభకు ప్రమాదం జరిగింది. ఆమె  ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ దుర్ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా కూడా  తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రంభ తన పిల్లలతో పాటు  ప్రయాణిస్తున్న కారు మంగళవారం యాక్సిడెంట్‌కు గురి అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, వారిని చూసుకునే ఆయా ఉన్నారు.

ఈ విషయాన్ని స్వయంగా రంభనే.. తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుంటే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే దేవుడి దయ వల్ల ఈ యాక్సిడెంట్‌లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపారు. దీంతో ప్రస్తుతం రంభ చేసిన పోస్ట్‌ వైరలవుతోంది.

ఇంటర్ సెక్షన్ దగ్గర తమ కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో తనతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారని పోస్టులో వెల్లడించారు రంభ. దయ వల్ల ఈ ప్రమాదంలో మేం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డామన్నారు. మేం అందరం సురక్షితంగా ఉన్నామన్నారు. కాకపోతే తన చిన్నారి సాషా దేవుడి ఇంకా ఆసుపత్రిలోనే ఉందన్నారు. టైమ్‌ అస్సలు బాగాలేదని ఆవేదన వ్యక్తంచేసింది.. దయచేసి మా కోసం దేవుడిని ప్రార్థించండి అంటూ రంభ పేర్కొన్నారు. చిన్నారి సాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానుల్ని ఆమె కోరారు. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం అని రంభ తన పోస్టులో వెల్లడించారు.

First published:

Tags: Car accident, Telugu Actress

ఉత్తమ కథలు