పెళ్లిలో..మందు సీసాతో రచ్చచేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్..

తెలుగు హీరోయిన్..రకుల్ ఓ పెళ్లిలో మందు సీసాతో చిందేస్తోంది. ఎక్కడా పెళ్లి..ఏమిటా సంగతీ..

news18-telugu
Updated: April 12, 2019, 5:42 PM IST
పెళ్లిలో..మందు సీసాతో రచ్చచేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్..
దే దే ప్యార్ దేలో రకుల్
news18-telugu
Updated: April 12, 2019, 5:42 PM IST
రకుల్ ప్రీత్ సింగ్..సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు భాగా దగ్గరైంది. అయితే ఆ సినిమా హిట్టైనా.. అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. గోపిచంద్ లౌక్యం తర్వాత రకుల్‌కు వరుసపెట్టి అవకాశాలు రావడం మొదలైయాయి. అప్పటి నుండి ఇక అవకాశాలకోసం ఎదురుచూసింది లేదు రకుల్. అయితే తెలుగులోనే కాకుండా..హిందీలోను నటిస్తోంది రకుల్. అందులో భాగంగా..ఆమె..అజయ్ దేవగన్ సరసన 'దే దే ప్యార్ దే' సినిమాలో టబుతో పాటు మరో హిరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే  విడుదలైన ట్రైలర్‌లో.. రకుల్ గ్లామర్ డోస్ కాస్త ఎక్కువైందనే కామెంట్స్ వినిపించాయి. బాలీవుడ్ లోకి వెళ్లిన చాలా మంది తెలుగు హీరోయిన్లు మోతాదుకు మించి తమ అందాలు ఆరోబోస్తుంటారు.  అందులో భాగంగా..రకుల్ కూడా గ్లామర్‌ను ఎక్కడ తగ్గకుండా చూసుకుంది.   తాజాగా ఈ మూవీ నుంచి వడ్డీ షరాబన్‌ అనే వీడియో సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. .. ఈ సాంగ్ లో రకూల్ చీర కట్టులోనే కనిపిస్తూ..తన అందాలతో పిచ్చెక్కిస్తోంది. ఆ పాటలో రకుల్.. చేతిలో మందు బాటిల్ పట్టుకొని తాగుతూ పంజాబీ స్టైల్‌లో ఆడుతూ.. పాడుతూ రచ్చ చేస్తోంది.

దే దే ప్యార్ దేలో రకుల్ Photo _ Instagram
దే దే ప్యార్ దేలో రకుల్ Photo _ Instagram


ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే 10 లక్షల మందికిపైగా యూట్యూబ్‌లో వీక్షించడం విశేషంగా చెప్పుకుంటున్నారు చిత్ర బృందం. ఈ పాటను సునిధీ చౌహాన్‌, నవ్‌రాజ్‌ హన్స్‌ పాడగా... విపిన్‌ పట్వా సంగీతం అందించారు. ఈ పాటకు ఇంతగా రెస్పాన్స్ రావడంతో రకుల్.. ‘‘వడ్డీ షరాబన్‌..’ షూటింగ్‌ ఎంతో సరదాగా జరిగింది.. ఇది ఓ గొప్ప అనుభవం. ఇంత చక్కటి పాటను నాకిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు. ఈ సినిమను అకీవ్‌ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. టీ సిరీస్‌ సంస్థ నిర్మించింది.First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...