• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • TELUGU ACTRESS JABARDASTH VARSHA ENGAGEMENT RING AND MANGALASUTRA POST GOES VIRAL ON INTERNET NR

Jabardasth Varsh: తాళిబొట్టుతో షాక్ ఇచ్చిన జబర్దస్త్ వర్ష.. త్వరలోనే పెళ్లినా?

Jabardasth Varsha

Jabardasth Varsh: బుల్లితెర సీరియల్ నటిగా ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ వర్ష. పలు సీరియల్స్ లో నటిస్తున్న వర్ష.. జబర్దస్త్ షో తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.

  • Share this:
    Jabardasth Varsh: బుల్లితెర సీరియల్ నటిగా ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ వర్ష. పలు సీరియల్స్ లో నటిస్తున్న వర్ష.. జబర్దస్త్ షో తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.  భారీగా ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ జబర్దస్త్ లో గెస్ట్ గా వచ్చి అక్కడే సెటిల్ అయ్యింది. పైగా తన గ్లామర్ తో యువత మనసులను ఇట్టాగే దోచేసుకుంది. అతి తక్కువ సమయంలోనే తన కామెడీతోనే కాకుండా అందంతోను లేడీ కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

    సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది వర్ష. ఇక జబర్దస్త్ లో మరొ కమెడియన్ ఇమ్మానియేల్ తో కలిసి హగ్గు లతో, ముద్దులతో బాగా రెచ్చిపోతుంది. పలు షోలలో కూడా వీరిద్దరూ చేసే రచ్చకు ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. అంతేకాకుండా ఈ బ్యూటీ పలు షోలలో గెస్ట్ గా పాల్గొని తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తాళిబొట్టుతో అందరినీ షాక్ అయ్యేలా చేసింది వర్ష.

    సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వర్ష.. నిత్యం తన హాట్ ఫోటో షూట్ లతో యువతను నిద్ర పోనీకుండా చేస్తుంది. ఇక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో చేతికి రింగు ధరించి జూలై 4న బిగ్ అనౌన్స్మెంట్ అంటూ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఓ ఫోటోను కూడా షేర్ చేయగా.. అందులో పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు ఎమోజీలతో పాటు ఓ రింగ్ కూడా పెట్టింది. పైగా అందులో ఎవరికీ చెప్పొద్దు అన్నట్టు ఓ ఎమోజిని కూడా షేర్ చేసింది వర్ష. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    ఇక ఈ పోస్టులు చూసిన వర్ష అభిమానులు తెగ షాక్ అవుతున్నారు. బహుశా వర్ష పెళ్లి చేసుకుంటుందేమోనని కామెంట్స్ చేస్తున్నారు. పైగా రింగ్ ఫోటో ఉండేసరికి నిశ్చితార్థం కూడా అయిపోయిందని అనుకుంటున్నారు. ఇక మరికొందరు ఇమ్మానియేల్ పరిస్థితి ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published: