Home /News /movies /

TELUGU ACTRESS BINDU MADHAVI LOVE AFFAIR WITH KOLLYWOOD YOUNG HERO SB

యంగ్ హీరోతో లవ్‌లో పడిన హీరోయిన్.. అతడు ఆమె కంటే నాలుగేళ్లు చిన్నోడా ?

బిగ్ బాస్ ఓటిటి తెలుగులో బిందు మాధవి (bindu madhavi)

బిగ్ బాస్ ఓటిటి తెలుగులో బిందు మాధవి (bindu madhavi)

తెలుగు సినిమాలో తొలిసారిగా కనిపించి.. ఆ తర్వాత తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. దీంతో అక్కడే ఓ యంగ్ హీరోతో ఈ భామ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

    బిందు మాధవి... ఆవకాయ్ బిర్యానీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. బిందు మాధవి హీరోయిన్‌గా సక్సెస్ కాలేక పోయింది. తెలుగులో ప్రముఖ ఓటిటి అయిన హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ ఓటిటి షోలో పాల్గొంటూ తన ఆటతీరు తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోవడంతో బిందు మాధవి సినిమా అవకాశాల కోసం తమిళ సినీ పరిశ్రమకి వలస వెళ్లి పోయింది. తమిళంలో మాత్రం వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకొని బాగానే రాణిస్తోంది. దీంతో ఈ అమ్మడు ఏకంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ పక్కనబెట్టి కోలీవుడ్లో సెటిలైపోయింది. అయితే ఈ మధ్య ఈ అమ్మడు

    అయితే తాజాగా నటి బిందు మాధవి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తమిళ్ సినిమాలు చేయడంతో గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో నివాసముంటోంది. ఈ క్రమంలో కోలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన యంగ్ హీరోతో ప్రేమలో పడిందని అంటున్నారు. బిగ్ బాస్ షోలో ఉన్న బిందు మాధవిని సపోర్ట్ చేస్తూ కోలీవుడ్ హీరో హరీష్ కళ్యాణ్.. ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసాడు. ఇక గతంలో కూడా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. అయితే హరీష్ కళ్యాణ్.. బిందుమాధవిని సపోర్ట్ చేయడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. దాంతో సోషల్ మీడియా ప్రియులు వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారంటూ అంతా చర్చించుకుంటున్నారు.

    బిందు మాధవి


    అయితే ఈ యంగ్ హీరో నటి బిందుమాధవి కంటే దాదాపుగా నాలుగు సంవత్సరాలు చిన్నవాడని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ కారణం వల్లే నటి బిందు మాధవి పెళ్లికి తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని మరికొందరు అంటున్నారు. అయితే ఇటీవలే బిగ్ బాస్ షోలో బిందు తన లవ్ స్టోరి గురించి చెప్పింది. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ యువకుడితో ప్రేమలో పడ్డానని కానీ చదువులు పూర్తయిన తర్వాత తన ప్రియుడు పై చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లి పోయాడని ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరికీ లవ్ బ్రేకప్ అయ్యిందని గతంలో పలుమార్లు తెలిపింది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bigg Boss, Bindu Madhavi, Kollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు