Home /News /movies /

TELUGU ACTORS REACTIONS ON PRIYANKA REDDY BRUTAL MURDER SR

షాద్‌నగర్ హత్యపై తీవ్రంగా స్పందించిన తెలుగు చిత్రసీమ

 లిఫ్ట్ ఇస్తామని తిరుపతిలో బాలికపై అత్యాచారం

లిఫ్ట్ ఇస్తామని తిరుపతిలో బాలికపై అత్యాచారం

హైదరాబాద్ శివారు షాద్‌నగర్ సమీపంలో వెటనరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

    హైదరాబాద్ శివారు షాద్‌నగర్ సమీపంలో వెటనరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిని మరో నిర్భయ ఘటనగా వర్ణిస్తున్నారు విశ్లేషకులు. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద గల టోల్ ప్లాజా సమీపంలో ప్రియాంక రెడ్డి కి చెందిన స్కూటీ పంక్చర్ ఐయ్యిందనీ చెప్పి, దగ్గరో ఉన్న షాప్ దగ్గర పంక్చర్ వేయించి తీసుకొస్తామని ప్రియాంకను నమ్మించి ఆమెను పక్కదారి పట్టించారు దుండగులు. ఆ తర్వాత ఆమెపై కృరంగా లైంగిక దాడి చేయడంతో పాటు, ఎక్కడ బయట చెప్పేస్తుందో అని చంపేశారు. ప్రియాంక శవాన్ని ఆ తర్వాత అక్కడి నుండి దూరంగా తీసుకెళ్లి కీరోసిన్ పోసి కాల్చి వేశారు. ఈ ఘటనపై అన్నివర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ ఘటనకు పాల్పడ్డ ఆ కిరాతకుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ప్రజలు. అలాగే ఈ ఘటనపై తెలుగు సినిమాకు చెందిన చాలా మంది ప్రముఖులు దీనిపై స్పందించారు. వారిలో కీర్తి సురేష్, లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నా, మెహ్రిన్ పిర్జా, సింగర్ చిన్మయి శ్రీపాద, రవితేజ, అల్లరి నరేష్, సుధీర్ బాబు,పూనమ్ కౌర్ మొదలగు వారు ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

















    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Telugu Movie News

    తదుపరి వార్తలు