నాగేశ్వరావు బయోపిక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బ‌యోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు,..రానున్న రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్.. కె.సి.ఆర్‌ దానికి సంకేతం. ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ నాగేశ్వరావుపై రానుంది. ఈ నాగేశ్వరావు బయోపిక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించనున్నారు.

 • Share this:
  ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బ‌యోపిక్‌ల హ‌వా నడుస్తోంది. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు,..రానున్న రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్.. కె.సి.ఆర్‌. ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ నాగేశ్వరావుపై రానుంది. ఈ నాగేశ్వరావు బయోపిక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాను దొంగాట‌, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాల డైరెక్టర్ వంశీకృష్ణ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర నిర్మించనున్నాడు.

  Bellamkonda Srinivas
  బెల్లంకొండ శ్రీనివాస్


  ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే..ఈ సినిమా... 1970 ద‌శకంలో పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన పేరు మోసిన దొంగ నాగేశ్వరావు జీవితంపై రానుంది. ఇతన్ని టైగ‌ర్ నాగేశ్వరావు అని కూడా పిలిచేవారు అప్పట్టో. ఈ నాగేశ్వరావు ఆంధ్రప్రదేశ్‌లోని స్టూవ‌ర్టుపురం ప్రాంతంలో చాలా తెలివిగా దొంగ‌త‌నాలు చేసేవాడు. ఒకవేళ పోలీసులు అరెస్టు చేస్తే వారి నుండి.. తెలివిగా త‌ప్పించుకునేవాడు. స్టూవర్టుపురం చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలు అత‌న్ని రాబిన్ హుడ్ అనేవారు. ఎందుకంటే ఇతను పెద్దోన్ని కొట్టి పేదోడికి పెట్టేవాడు. అయితే అదే పనిగా దొంగతనాలు చేస్తుండడంతో 1978లో నాగేశ్వరావును పోలీసులు కాల్చి చంపేశారు.
  Photos: క్యూట్ అనుపమ లేటెస్ట్ ఫోటోస్
  First published: