news18-telugu
Updated: January 14, 2020, 10:40 AM IST
Twitter
దేశంలో ఆ మధ్య సంచనలం సృష్టించిన మీటూ ఉద్యమానికి హిందీ చిత్రసీమ ఒణికిపోయింది. ఈ ఉద్యమంలో పాపులర్ నటులు తమను లైగింగకంగా వేధించారని కొందరు నటీమణులు ఆరోపించిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా ప్రముఖ విలక్షణ నటుడు నానా పటేకర్‌పై తనూశ్రీ దత్తా ఆరోపణ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చాలా మంది నటులపై ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ ‘మీటూ’ ఇప్పుడు బెంగాలీ పరిశ్రమకు పాకింది. వివరాల్లోకి వెళితే.. ‘భూమికన్య’ అనే సీరియల్ స్క్రిప్టు చర్చించాలని రమ్మంటూ దర్శకుడు అరిందం సిల్ తనతో తప్పుగా ప్రవర్తించాడని నటి రూపాంజన మిత్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ‘స్క్రిప్టు విషయంలో కొంత చర్చించాలని దానికోసం నన్ను కోల్‌కతాలోని తన ఆఫీసుకు రమ్మని పిలిచాడని పేర్కోంది. నేను సాయంత్రం 5 గంటలకు.. ఆఫీసుకు వెళ్లే సరికీ అక్కడ ఎవరూ లేకపోవడం చూసి కొంత ఆశ్చర్యం వేసింది. అప్పుడే నాకెందుకో తేడాగా అనిపించింది. ఆ సమయంలో దర్శకుడు ఒక్కసారిగా తన సీటు నుంచి పైకిలేచి నా ముఖం, భుజంపై చేయి వేశాడు. ఆ తర్వాత మృదువుగా నిమరడం చేశాడు. అయితే ఆ సమయంలో ఆఫీసులో నేను, ఆ దర్శకుడు మాత్రమే ఉన్నాం. దీంతో నాకు చాలా భయమేసిందని తెలియజేసింది.

Twitter
ఆమె ఇంకా మాట్లాడుతూ.. రేప్ జరుగుతుందేమో అన్న సందేహాం కూడా ఓ దశలో కలిగిందని.. గదిలోకి ఎవరైనా వస్తే బాగుండు అంటూ దేవున్ని ప్రార్థించా అని పేర్కోంది. కొంత సమయం తర్వాత ఆయన సతీమణి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా ఏమోషనల్ అయ్యాను.. గుక్కపట్టి గట్టిగా ఏడ్చానని తెలిపింది. అయితే దర్శకుడు అరిందం సిల్ ఈ ఆరోపణల్ని ఖండించాడు. ఆమె ఇలా ఎందుకు చెప్పారో నాకు తెలియదు. మేం పాత స్నేహితులం అని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం రూపాంజన మిత్రా బెంగాలీ టీవీ షోల్లో పాపులర్ నటి. ఆమె అనేక సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కియారా హాట్ పిక్స్..
Published by:
Suresh Rachamalla
First published:
January 14, 2020, 10:31 AM IST