Home /News /movies /

Anchor Shyamala: రెడ్లుకి కోపం ఎక్కువ పెళ్లి వద్దన్నారని.. 17 ఏళ్లకే ప్రేమించినవాడితో జంప్ అయిన యాంకర్!

Anchor Shyamala: రెడ్లుకి కోపం ఎక్కువ పెళ్లి వద్దన్నారని.. 17 ఏళ్లకే ప్రేమించినవాడితో జంప్ అయిన యాంకర్!

shyamala

shyamala

Anchor Shyamala: బుల్లితెర యాంకర్ శ్యామల పరిచయం గురించి అందరికీ తెలిసిందే. వెండితెర లో కూడా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్యామలా..

    Anchor Shyamala: బుల్లితెర యాంకర్ శ్యామల పరిచయం గురించి అందరికీ తెలిసిందే. వెండితెర లో కూడా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్యామలా.. నరసింహాను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన ప్రేమ పెళ్లి లో జరిగిన ట్విస్ట్ ల గురించి పంచుకుంది.


    తను బుల్లితెరలో జగదేకవీరుడు అతిలోకసుందరి సీరియల్లో నడుస్తున్న సమయంలో తన భర్త టీవీ నటుడు నరసింహ తనకు అందరిలా కనిపించలేదని, ఆమెతో కలిసి నటించాలని తనకు డైరెక్టర్ చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేదని ఇక ఆ సమయంలోనే తన మైండ్ లో కాస్త డిఫరెంట్ గా ఉన్నాడని అనుకుందట. ఇక మొదట వెళ్లి తానే పరిచయం చేసుకుందట. ఇక అతను నటించిన సీరియల్ గురించి తన నటన గురించి కబుర్లు చెప్పడం మొదలు పెట్టిందట.


    ఇక ఆ తర్వాత ప్రేమించుకొని ఒక్కటవ్వాలని అనుకున్నారట. కానీ శ్యామల వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదట. కారణం శ్యామల బ్రాహ్మణి, నరసింహ రెడ్డి కులానికి చెందినవారు కాగా.. ఇక వాళ్ళ అమ్మకి రెడ్డి లంటే ఫ్యాక్షనిస్టుల గా చూస్తుందని, వాళ్లంటే చాలా కోపం అని వద్దని చెప్పేసిందట. కాని తను ఎంత నచ్చచెప్పినా ఒప్పుకోక తన కుటుంబ సమక్షంలో ఏకంగా పంచాయతీని పెట్టించదట‌. ఇక తమ కుటుంబ సభ్యులు నరసింహ తో తన పేరెంట్స్ ని పిలిపించిమని వాళ్లు అడగగా.. వాళ్ల ఆ సమయంలో అమెరికాలో ఉన్నారని చెప్పగా తమ కుటుంబ సభ్యులు నమ్మలేదని ఎంత చెప్పినా వినలేదని తెలిపింది.


    ఇక వాళ్ళిద్దరినీ పెళ్లి మేటర్ మర్చిపోమని రెండేళ్ల వరకు కలిసి ఉంటే పెళ్లి చేస్తామని అన్నారట. కానీ వీరిద్దరూ రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తారని నమ్మకం లేక తన కుటుంబ సభ్యులతోనే నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్లి పెళ్లి చేస్తే ఏంటని అడిగేసిందట.. ఇక వాళ్ల కుటుంబ సభ్యులకు కాస్త అనుమానం రావడంతో తన షూటింగ్ నుంచే తీసుకెళ్లాలని ప్లాన్ చేశారట. ఇక వాళ్ళు డైరెక్టర్ తో చెప్పి తనను తీసుకెళ్లడానికి ప్లాన్ చేయగా అక్కడ్నుంచి అక్కడే జంప్ అవ్వాలనుకుందట‌. కానీ కుదరక పోయే సరికి తన దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నారట. వారిద్దర్నీ కలవకుండా చేశారట.


    ఇక ఆ సమయంలో బిగ్ బాస్ ఫేమ్ హరితేజ ఫోన్ తీసుకొని నరసింహ కి ఫోన్ చేయగా తను రాకుండా ప్రొడక్షన్ మేనేజర్ ని పంపాడట. ఇక ఆ సమయంలో తనను తీసుకెళ్లకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్డుపడి ఆ సెట్లోనే రచ్చరచ్చ చేశారట. ఇక ఆ సమయంలో తన అమ్మ తనని అక్కడే వదిలేసి నీ చావు నువ్వు చావు పో అని అక్కడి నుంచి వెళ్లిపోయిందట.


    ఆ తర్వాత నరసింహ తన అక్క వాళ్ళింట్లో తనని ఏడాదిపాటు ఉంచాడట‌. ఇక పెళ్లి చేసుకోవాలంటే తనకు అప్పటికి 18 ఏళ్లు లేవు అని ఆగాల్సి వచ్చిందట. ఇక ఆ తర్వాత తన అమ్మతో మాట్లాడడానికి తెగ ప్రయత్నం చేసిందట. ఇక పెళ్లయిన రెండేళ్ళ తర్వాత తన అమ్మ అందరూ తన ప్రేమను అర్థం చేసుకొని కలిశారని చెప్పుకొచ్చింది శ్యామల.

    Published by:Navya Reddy
    First published:

    Tags: Anchor Shyamala, Bigg boss season 2, Bramhins, Husband narasimha, Reddys

    తదుపరి వార్తలు