• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • TELEVISION ANCHOR RASHMI GAUTHAM SHOCKING DECISION ON SILVER SCREEN NR

Rashmi Gautam: షాకింగ్ డెసిషన్ తీసుకున్న రష్మీ గౌతమ్.. ఇకపై అక్కడ కనిపించదట!

rashmi gautham

Rashmi Gautam: బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. తన అందాలతో, డాన్సులతో బాగా ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ..

  • Share this:
    Rashmi Gautam: బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. తన అందాలతో, డాన్సులతో బాగా ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం బుల్లితెర లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అంతేకాకుండా బుల్లితెర లోనే వరుస ఆఫర్లతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

    రష్మీ బుల్లితెరకు ముందు వెండితెర లో నటించిన సంగతి తెలిసిందే. పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో నటించగా అంత గుర్తింపు పాత్రలో నటించలేదనే చెప్పుకోవచ్చు. ఇక బుల్లితెరపై పరిచయం తర్వాత ఓ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించగా.. ఈ సినిమా తనకు ఎటువంటి సక్సెస్ ఇవ్వలేదు. వెండితెరపై అనసూయకున్న క్రేజ్ రష్మీ కి లేదు. ఇదిలా ఉంటే తాజాగా రష్మీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

    తనకు కలిసిరాని సినిమా రంగానికి పూర్తిగా దూరం కావాలని నిర్ణయం తీసుకుందట. బుల్లితెరపై కావలసినంత క్రేజ్, ఆఫర్స్ ఉండగా.. ఇలాంటి సమయంలో ఏదైనా సినిమా ఆఫర్ వస్తే తను టీవీ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ మొత్తం రీ అరెంజ్ చేయాల్సి వస్తుందట‌. అయినా కానీ సినిమా నుండి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేకపోయేసరికి ఈ డెసిషన్ తీసుకుందట‌. ఒకవేళ సినిమాల్లో భారీ అవకాశాలు వస్తే నటించడానికి ఆసక్తి చూపిస్తుందట. కానీ చిన్న చిన్న పాత్రలు జోలికి అసలు వెళ్ళొద్దని ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రష్మీ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఢీ ప్రోగ్రాం లో కూడా యాంకరింగ్ చేస్తుంది.
    Published by:Navya Reddy
    First published: