Jr NTR - Puvvada Ajay: జూనియర్ ఎన్టీఆర్‌తో తెలంగాణ మంత్రి ప్రత్యేక భేటీ.. కారణం ఇదే..!

జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ (Jr NTR Puvvada Ajay)

Jr NTR - Puvvada Ajay: జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఇప్పుడు సినిమాలకు తప్ప మరో దానికి చోటివ్వడం లేదు. ముఖ్యంగా రాజకీయాలకు అయితే చాలా దూరంగా ఉంటాడు. తాజాగా ఓ తెలంగాణ మంత్రి ప్రత్యేకంగా వచ్చి జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసాడు. అది కూడా కొడుకుతో పాటు మరీ వచ్చాడు. ఆయనే పువ్వాడ అజయ్..(Puvvada Ajay)

  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలకు తప్ప మరో దానికి చోటివ్వడం లేదు. ముఖ్యంగా రాజకీయాలకు అయితే చాలా దూరంగా ఉంటాడు. సొంత పార్టీలోనూ యంగ్ టైగర్ ప్రస్తుతం యాక్టివ్‌గా లేడు. అప్పుడెప్పుడో పదేళ్ళ కింద ఎన్నికల ప్రచారం మినహాయిస్తే ఇప్పటి వరకు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లో ఎన్టీఆర్ కనిపించిందే లేదు. తనకు సంబంధమే లేదన్నట్లు ఉంటాడు. అయితే అప్పుడప్పుడూ ఈయన రాజకీయ నేతలతో మాత్రం కలుస్తుంటాడు. వాళ్లను కలిసి మాట్లాడుతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా ఓ తెలంగాణ మంత్రి ప్రత్యేకంగా వచ్చి జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసాడు. అది కూడా కొడుకుతో పాటు మరీ వచ్చాడు. ఆయనే పువ్వాడ అజయ్.. తెలంగాణ రవాణా శాఖా మంత్రి. ఈయన తారక్‌తో భేటీ అయ్యారు. తన కుమారుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‏ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసారు. అసలు విషయం ఏంటంటే.. మంత్రి గారి కుమారుడు నయన్.. నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్‏కు పెద్ద అభిమాని.

అందుకే కొడుకు బర్త్ డే సందర్భంగా అభిమాన హీరోను కలిపించాడని తెలుస్తుంది. కేవలం యంగ్ టైగర్‌ను మాత్రమే కాదు.. మంత్రి కేటీఆర్‏ను కూడా పువ్వాడ అజయ్ తన కుమారుడితో పాటు వెళ్లి కలిశారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య ఇంటి దగ్గరే ఉంటున్న ఎన్టీఆర్.. అభిమానులను రెగ్యులర్‌గా కలుస్తూనే ఉన్నాడు. వాళ్ల కోసం ప్రత్యేకంగా సమయం కూడా కేటాయిస్తున్నాడు.

ఇప్పుడు కూడా ఇదే చేసాడు జూనియర్. ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు కొరటాల శివ సినిమాతోనూ బిజీగా ఉన్నాడు జూనియర్. ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన తెలంగాణ మంత్రి అనే లైన్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: