హోమ్ /వార్తలు /సినిమా /

Tollywood | Telangana : తెలంగాణ నేపథ్య సినిమాలు.. ప్రేక్షకుల నుంచి మన్ననలు..

Tollywood | Telangana : తెలంగాణ నేపథ్య సినిమాలు.. ప్రేక్షకుల నుంచి మన్ననలు..

Telangana Based Movies Photo : Twitter

Telangana Based Movies Photo : Twitter

Tollywood : ఒకప్పుడు తెలంగాణ యాసంటే కాస్త చిన్నచూపు ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అందరి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు తెలంగాణ భాష, యాస, సంస్కృతికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. ఇక గత కొంత కాలంగా టాలీవుడ్​లో తెలంగాణ నేపథ్యంలో (Telangana Based Movies ) వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఘన విజయం కూడా సాధిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ (Telangana) ప్రాంతానికి ప్రత్యేక సంస్కృతి, నేపథ్యం ఉన్నాయి.. అక్కడ యాస, భాషలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అక్కడ జీవవిధానం కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా ఉంటుంది. హిందీ, ఉర్దూ, అరబిక్​ కలగలసిన తెలుగు ఇక్కడి ప్రత్యేకత. ప్రతి విషయాన్ని సొంతం చేసుకుని పలకరించే తెలంగాణ యాస, వేషధారణ, అందరినీ బంధువులను చేసుకుని అన్న, అక్క అంటూ ఆత్మీయ పలకరింపు తెలంగాణకే సొంతం. ఒకప్పుడు తెలంగాణ యాసంటే కాస్త చిన్నచూపు ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అందరి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు తెలంగాణ భాష, యాస, సంస్కృతికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. ఇక గత కొంత కాలంగా టాలీవుడ్​లో తెలంగాణ నేపథ్యంలో (Telangana Based Movies ) వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఘన విజయం కూడా సాధిస్తున్నాయి. ఇలా విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మెప్పించిన.. తెలంగాణ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

దసరా..

న్యాచురల్‌ స్టార్‌ నాని, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో ఈ నెల 30న విడుదలైన చిత్రం దసరా (Dasara movie). ఈ సినిమా కథ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఇప్పటికే విడుదల చిత్రం ప్రేక్షకుల మన్నన అందుకుంది. అన్ని చోట్ల నుంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో శ్రీకాంత్​ ఓదెల దర్శకుడిగా పరిచయం అవ్వగా.. అతనితోపాటు, నాని కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా దసరా నిలిచిందని చెప్పవచ్చు.

Telangana themed movies, Telangana based movies, dasara collections, balagam movie watch online, tollywood news, తెలంగాణ సినిమాలు, దసరా కలెక్షన్స్, బలగం మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్
Dasara Photo : Twitter

బలగం....

జబర్ధస్త్​ షోతో కమెడియన్​గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తీసిన చిత్రం బలగం(Balagam). తెలంగాణ లోని విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన బలగం చిత్రం కుటుంబ విలువలను కలిగి ఉన్న సినిమాగా అందరినీ బాగా ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్​ రామ్​ హీరోహీరోయిన్లుగా ఒదిగిపోయారు. దిల్​రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్​గానూ మంచి విజయం దక్కించుకుంది.

Telangana themed movies, Telangana based movies, dasara collections, balagam movie watch online, tollywood news, తెలంగాణ సినిమాలు, దసరా కలెక్షన్స్, బలగం మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్
Balagam movie (Twitter/Photo)

రుద్రమదేవి...

కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘రుద్రమదేవి’(Rudhramadevi ). ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ ‘ది వారియర్‌ క్వీన్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైంది. ఈ సినిమాలో కాకతీయ సామ్రాజ్యం, తెలంగాణలోని నేటి వరంగల్​ ఒకప్పటి ఓరుగల్లు రాజధానిగా రుద్రమదేవి పాలన గురించి వివరించారు.

Telangana themed movies, Telangana based movies, dasara collections, balagam movie watch online, tollywood news, తెలంగాణ సినిమాలు, దసరా కలెక్షన్స్, బలగం మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్
Rudhramadevi Photo : Twitter

ఫిదా...

వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫిదా (Fidaa) మూవీ లో కూడా తెలంగాణ సంప్రదాయాల గురించి చూపించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌ – బస్టర్ ఫలితాలతో తడిసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటినా ఈ పాట మాత్రం, ఇంకా జనాల మదిలోనే కాక నాలుకలపై కూడా నర్తిస్తుంది. అప్పుడప్పుడు వార్తల్లోకి ప్రవహిస్తూనే ఉంది. “వచ్చిండే.. మెల్లా మెల్లగా వచ్చిండే..” అంటూ సింగర్ మధుప్రియ పాడిన అశోక్ తేజ గీతానికి స్పింగులు మింగినట్లు సాయిపల్లవి తన నృత్యంతో నర్తించి అందరినీ ఫిదా చేసిన ఈ పాట ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీ లో టాప్ రికార్డు ను సొంతం చేసుకుంది.

Telangana themed movies, Telangana based movies, dasara collections, balagam movie watch online, tollywood news, తెలంగాణ సినిమాలు, దసరా కలెక్షన్స్, బలగం మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్
Fidaa Photo : Twitter

ఇవే కాకుండా చాలా సినిమాలు తెలంగాణ నేపథ్యంలో రూపొంది ప్రేక్షకులను మెప్పించాయి. డీజే టిల్లు సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా తెలంగాణ యాసతో డైలాగ్స్​ చెప్పి నవ్వులు పూయించారు. ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలోనే కొనసాగుతుంది. నవీన్ పోలిశెట్టి హీరో గా వచ్చిన జాతి రత్నాలు, రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం లోని కొమురం భీం పాత్రలు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారివే.. నాగార్జున గతంలో రాజన్న సినిమాను కూడా తెలంగాణ నేపథ్యంలో తీసి... ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా నటులు కూడా తెలంగాణ యాస, భాషలను ఎంతో ఇష్టంతో నేర్చుకుని మాట్లాడటంతో అభిమానులను ఆ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

First published:

Tags: Balagam Movie, Dasara Movie, Fidaa, Tollywood news

ఉత్తమ కథలు