Tollywood Telangana | తెలుగు సినిమా పురుడు పోసుకొని ఎనిమిది దశాబ్ధాలు దాటి 90 దశకంలోకి అడుగు పెట్టబోతుంది. ఇన్నేళ్ల తెలుగు సినిమా ప్రస్థానంలో తెలంగాణాకు చెందిన టెక్నిషియన్స్ తక్కువనే చెప్పాలి. ఐతే ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతం నుండి చాలా మంది దర్శక, నిర్మాతలు, హీరోలు వాళ్ల సత్తా చూపెడుతున్నారు. మొత్తంగా తెలుగుతెరపై సత్తా చూపెడుతున్న తెలంగాణ హీరోలు, టెక్నిషియన్స్‌పై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఫోకస్. ఈ మధ్య టాలీవుడ్ తెరపై చిన్న సినిమాగా విడుదలైన ‘జాతి రత్నాలు’ సినిమా మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమాను డైరెక్టర్ అనుదీప్, నిర్మాత నాగ్ అశ్విన్ ఇద్దరూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. మరోవైపు నాలుగేళ్ల క్రితం చిన్న సినిమాగా విడుదలైన పెద్ద విజయం సాధించిన మూవీ ‘పెళ్లిచూపులు’. ఈ మూవీ 2016గాను జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డును గెలుచుకుంది. దాంతో పాటు ఈ మూవీని డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ ఉత్తమ మాటల రచయతగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్నారు.
తెలంగాణ ప్రాంతం నుంచి వేళ్ల మీద లెక్కవెట్టె కళాకారులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.నటుల విషయనికోస్తే జానపద హీరోగా కత్తి కాంతారావు టాలీవుడ్‌లో ఆయనకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పరుచుకున్నారు.
ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా, విలన్‌గా మెప్పించిన ప్రభాకర్ రెడ్డి.. మరో విలన్ త్యాగరాజు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం. అలాగే కమెడియన్‌గా నవ్వించిన బాబు మోహన్, వేణుమాధవ్, ఉన్నారు. ఈ జనరేషన్‌లో నితిన్ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి హీరోగా ఆయనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. లేటెస్ట్‌గా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే.
ఐతే వీళ్ళందరికన్న ముందే తెలంగాణ కళాకారులకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన నటుడు పైడి జైరాజ్. తెలంగాణలోని కరీంనగర్‌లో పుట్టిన జైరాజ్.. తెలుగుల ఒక్క సినిమాలో యాక్ట్ చేయకపోయినా..బాలీవుడ్‌లో ఆయనకంటూ సూపర్ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.
1990 లో అక్కినేని నాగేశ్వర్రావు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటే....అంతకు పదేళ్లకు ముందే 1980లో పైడి జైరాజ్..ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. జైరాజ్ ప్రతిభను దేశమంతా గుర్తు పెట్టుకున్న ...తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఈ సూపర్ స్టార్‌ని మాత్రం గుర్తించ లేకపోవడం దురదృష్టకరం.
తెలంగాణ దర్శకుల విషయానికొస్తే..శ్యామ్ బెనగళ్ ఈ పేరు వినని భారతీయ సినీ ప్రేమికుడు ఉండరు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ దర్శకుడు బాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారు. ఈయన టాలెంట్‌కు కేంద్రం ‘పద్మశ్రీ’ బిరుదుతో గౌరవించింది. అంతేకాదు చలన చిత్ర రంగంలనే పేరు మోసిన దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకున్న ఘనాపాఠి బెనగళ్.
ఆ తర్వాత... తెలంగాణ సినిమాను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు బి.నరసింగ్ రావు. మెదక్ జిల్లాలో పుట్టిన ఈ డైరెక్టర్..‘దాసి’,‘మట్టి మనుషులు’,‘మా భూమి’ వంటి ఎన్నో కళాత్మక సినిమాలు తెరెకెక్కించారు.
అటు అల్లాణి శ్రీధర్ కూడా ‘కొమరం భీమ్’ సినిమాతో జాతీయ స్థాయిల గుర్తింపు తెచ్చుకున్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గొండు వీరుడు కొమ్రం భీమ్ జీవిత కథను వాస్తవికంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
Drushyam Movie Review : విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీ రివ్యూ..
ఇపుడు రాజమౌళి.. ఎన్టీఆర్‌తో కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజులుగా ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కించారు. వచ్చే యేడాది జనవరి 7న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఈ జనరేషన్‌లో ఎన్.శంకర్, దశరథ్, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి, సానా యాదిరెడ్డి, హరీష్ శంకర్, సంపత్ నంది, శ్రీరామ్ వేణు, నందిని రెడ్డి, మధుర శ్రీధర్ రెడ్డి, క్రాంతి మాధవ్, టి.ప్రభాకర్, రఫీ, రసమయి బాలకిషన్, హను రాఘవపూడి, ప్రేమ్‌రాజ్ వంటి ఎంతో మంది దర్శకులు తమ సత్తా చూపెడుతున్నారు.
అటు అర్జున్ రెడ్డి మూవీతో సందీప్ రెడ్డి వంగా, ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’తో సత్తా చూపెట్టిన నాగ్ అశ్విన్, ‘నీది నాది ఒకటే ప్రేమకథ’ ఫేమ్ వేణు ఊడుగుల, ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర, ‘పెళ్లి చూపులు’ సినిమాతో సత్తా చాటిన తరుణ్ భాస్కర్..‘ఛలో’ మూవీతో అట్రాక్ట్ చేసిన వెంకీ కుడుముల, జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్, వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు వంటి తెలంగాణకు చెందిన దర్శకులు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతున్నారు.
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సుధాకర్ రెడ్డి వంటివారు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. తాజాగా శ్రీకాంత్‌తో కేసీఆర్ ఉద్యమం నుంచి సీఎంగా ఎదిగిన తీరుపై తెరకెక్కించిన ‘తెలంగాణ దేవుడు’ సినిమాను వడత్యా హరీష్ డైరెక్ట్ చేసారు. ఏమైనా గడిచిన కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dil raju, Harish Shankar, Kanta Rao, Nithiin, Shankar N, Surender reddy, Telangana, Telangana cinema, Tollywood, Vijay Devarakonda