
యాంకర్ మంగ్లీ (ట్విట్టర్ ఫోటో)
నటరాజ్ హీరోగా, నూరిన్, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జాయ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు
వీ6 ఛానల్లో తీన్మార్ వార్తలతో టీవీ ప్రేక్షకులకు పరిచయమైన మంగ్లీ... ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పాపులర్ యాంకర్‌గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలంగాణ పండగ ‘బతుకమ్మ’ పాటలతో తెలుగు ప్రజల్లో మంగ్లీ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇన్నాళ్లూ గాయనిగా, టీవీ యాంకర్‌గా బుల్లితెర వీక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆమె ఇప్పుడు వెండితెరపై కనిపించనుంది. ‘ఊల్లాల ఊల్లాల’తో నటిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నటుడు సత్యప్రకాశ్ దర్శకుడిగా ఈ సినమాతో పరిచయమవుతున్నారు. చిత్రనిర్మాత గురురాజ్ మాట్లాడుతూ ‘‘మా చిత్రంలో మంగ్లీ నటించడమే కాదు. పాట కూడా పాడారని తెలిపారు. నూరిన్‌కి డబ్బింగ్ కూడా చెప్పారన్నారు. ర్యాప్ సింగర్ రోల్ రైడా ఓ పాట పాడటంతో పాటు అందులో నటించారన్నారు. నటరాజ్ హీరోగా, నూరిన్, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జాయ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.
Published by:Sulthana Begum Shaik
First published:October 20, 2019, 12:20 IST