ప్రభాస్ ‘సాహో’ మూవీకి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..
saaho | ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
news18-telugu
Updated: August 25, 2019, 1:32 PM IST

‘సాహో’కు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్ (File Photo)
- News18 Telugu
- Last Updated: August 25, 2019, 1:32 PM IST
ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. ‘బాహుబలి’ సూపర్ సక్సెస్ తర్వాత ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. అతని సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు అన్ని భాషలకు చెందిన అభిమానులు కూడా ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 30న విడుదల కానున్న ఈసినిమాకు సెన్సార్ కంప్లీట్ కాగానే శనివారం నుంచి బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఐతే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఫస్ట్ వీక్ ఎక్కువ రేటుతో టికెట్ అమ్ముకోవడంతో పాటు స్పెషల్ బెనిఫిట్ షోల కోసం ‘సాహో’ చిత్ర నిర్మాతలు స్పెషల్ పర్మిషన్ కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ‘సాహో’ చిత్ర నిర్మాతల రిక్వెస్ట్‌ను సున్నితంగా తిరస్కరించింది. ‘బాహుబలి 2’ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సినిమాకు కూడా బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. తాజాగా ‘సాహో’ సినిమాకు కూడా టికెట్ రేటు పెంచుకోవడంతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఏపీలో ‘సాహో’ సినిమాకు బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్ రేటు పెంచుకోవడానికి స్పెషల్ జీవో జారీ చేసినట్టు సమాచారం. ఇక వైజాగ్,తిరుపతి, విజయవాడ వంటి సెంటర్లో మాత్రం పెరిగిన రేట్లతోనే టికెట్స్‌ను సెల్‌కు పెట్టారు. ఇక తెలంగాణ విషయంలో బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి రాని ‘సాహో’చిత్ర నిర్మాతలకు ఏపీలో మాత్రం బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్ రేట్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం ‘సాహో’ చిత్ర నిర్మాతలకు కాస్తలో కాస్త ఊరట.

ప్రభాస్ సాహో (Source: Twitter)

ఆర్టీసీలో వారికి ఉద్యోగాలు... కేసీఆర్ హామీ అమలు...
కేసీఆర్‌కు సీనియర్ నేత షాకిస్తారా... నిర్ణయం అప్పుడే...
కేసీఆర్ సన్నిహితుడికి మంత్రి హోదా... ఉత్తర్వులు జారీ...
కేసీఆర్ ఉగ్రరూపం... ఎన్‌కౌంటర్‌పై మంత్రి రియాక్షన్
ఆ హామీలకు నా హార్ట్ స్పీడ్ పెరిగింది.. కేసీఆర్‌పై హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్టీసీలో లేఖల కలకలం... కార్మికులకు కొత్త టెన్షన్
Loading...