Home /News /movies /

TELANGANA MOVIES TELANGANA CULTURE HOW HOW DID THE RISE OF TELANGANA PRIDE IN TOLLYWOOD CINEMA TA

Tollywood Telangana: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలంగాణ సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది అంటే..

టాలీవుడ్‌లో తెలంగాణ సినీ ప్రస్థానం (Twitter/Photo)

టాలీవుడ్‌లో తెలంగాణ సినీ ప్రస్థానం (Twitter/Photo)

Tollywood Telangana | తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా ఆర్ట్ సినిమాలు, ప్యార్‌లల్ సినిమాలే కావడం విశేషం.బాలీవుడ్, తెలుగు సినిమా (టాలీవుడ్) తరహా కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్ తరహాలో ఇప్పటివరకూ తెలంగాణా సినిమాలు అంతగా రాలేదనే చెప్పాలి. అయితే గమ్మత్తుగా, పూర్తి ఆర్ట్ ఫిలిం ఫార్మాట్‌లో తీసిన ‘మాభూమి’ సినిమా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్‌గా మంచి వసూళ్లనే సాధించింది.  

ఇంకా చదవండి ...
Tollywood Telangana: దేశ ప్రజలకు 1947 ఆగష్టు 15న స్వాతంత్రం లభిస్తే...తెలంగాణ ప్రాంత వాసులకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చింది. 80ఏళ్లకు పైగా కొనసాగుతూనే ఉన్న తెలుగు సినిమా ప్రస్థానంలో తెలంగాణ సినిమా వయసు 44 ఏళ్లు మాత్రమే. 1974లో శ్యామ్‌బెనగల్ తెరకెక్కించిన ‘అంకుర్’ సినిమాతోనే తెలంగాణా కథా వస్తువుతో సినిమా మొదలయిందని చెప్పాలి. అయితే ఇది హిందీలో తెరకెక్కిన ఆర్ట్ ఫిల్మ్. ఆ మరుసటి యేడాది  1975లో మాధవరావు దర్శకత్వంలో వచ్చిన ‘చిల్లరదేవుళ్లు’ సినిమా తెలంగాణా కథ, భాష, యాసలతో వచ్చిన తొలి సినిమా. దాశరథి రంగాచార్య రాసిన ‘చిల్లర దేవుళ్లు’ నవలా ఈ సినిమాకు మూలం. అప్పట్నించీ ఇప్పటివరకూ ‘తెలంగాణ సినిమా’ అని చెప్పగలిగిన సినిమాలు మొత్తం 100లోపే ఉన్నాయనేది వాస్తవం.

అయితే ఈ సినిమాలన్నీ దాదాపుగా ఆర్ట్ సినిమాలు, ప్యార్‌లల్ సినిమాలే కావడం విశేషం.బాలీవుడ్, తెలుగు సినిమా (టాలీవుడ్) తరహా కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్ తరహాలో ఇప్పటివరకూ తెలంగాణా సినిమాలు అంతగా రాలేదనే చెప్పాలి. అయితే గమ్మత్తుగా, పూర్తి ఆర్ట్ ఫిలిం ఫార్మాట్‌లో తీసిన ‘మాభూమి’ సినిమా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్‌గా మంచి వసూళ్లనే సాధించింది.  ఆ తర్వాత కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్ కోణంలోంచి ఎన్నెన్నో తెలంగాణ నేపథ్య సినిమాలు ‘తెలుగు సినిమా’లో భాగంగా వచ్చాయి.

‘మా భూమి’ (File/Photo)


ఇక ఎన్టీఆర్ కూడా బాలకృష్ణ ముఖ్యపాత్రలో ‘వేములవాడ భీమకవి’ సినిమాను తెలంగాణ నేపథ్యం వచ్చిన సినిమా అనే చెప్పాలి. అటు బాలయ్య ‘నిప్పురవ్వ’ సినిమా తెలంగాణకు చెందిన సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించినా.. పూర్తి కమర్షియల్ సినిమా అనే చెప్పాలి. అటు చిరంజీవి ‘ముఠా మేస్త్రీ’ మూవీ కూడా తెలంగాణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కించారు. ఇది పూర్తి స్థాయి కమర్షియల్ సినిమానే. అంతకు ముందు చిరంజీవి ‘రుద్రనేత్ర’ సినిమాలో తెలంగాణ ప్రాంత యువకుడిగా కాసేపు కనిపించారు. ఆ సంగతి పక్కన పెడితే..  ఇపుడిపుడే.. అర్జున్ రెడ్డి, ఫిదా, లవ్ స్టోరీ,  పిట్ట గోడ. జాతి రత్నాలు వంటి సినిమాలు తెలంగాణ భాష, యాస నేపథ్యంలో వచ్చినవే అనే చెప్పాలి. ఇక F2 మరియు F3 సినిమాలో కూడా హీరో వరుణ్ తేజ్.. తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన యువకుడి పాత్రలో నటించాడు. ప్రస్తుతం తెలంగాణ భాష, యాస తెలుగు సినిమాలో భాగమైపోయాయి.

F3 - TS - AP 2nd Day Share Movies : రెండో రోజు ఏపీ, తెలంగాణలో ఎఫ్ 3 మూవీ మరో రికార్డు.. మొత్తంగా ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..,F3,F3 Movie Collections,rrr 2 days ww collections,AP-TG 2nd Day Highest Share Movies,AP-TG 2nd Day Highest Share Movie rrr movie,AP-TG 2nd Day Highest Share Movie bheemla nayak,AP-TG 2nd Day Highest Share Movie pushpa,AP-TG 2nd Day Highest Share Movie bahubali 2,AP-TG 2nd Day Highest Share Movie vakeel saab,AP-TG 2nd Day Highest Share Movie ala vaikuntapurramuloo,AP-TG 2nd Day Highest Share Movie sye raa,AP-TG 2nd Day Highest Share Movie rangasthalam,AP-TG 2nd Day Highest Share Movie sarileru neekevvaru,telugu cinema,rrr 2 డేస్ కలెక్షన్స్,రెండో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు,భీమ్లా నాయక్ సెకండ్ డే షేర్ 13.14 కోట్లు,పుష్ప 14 కోట్లు షేర్,బాహుబలి 2 14.80 కోట్ల షేర్,F3 రెండో రోజు కలెక్షన్స్
ఎఫ్ 3 మూవీ (Twitter/Photo)


ఇక పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తిగా తెలంగాణ హైదరాబాదీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ యాస, భాష అన్ని తెలంగాణలోనే ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం.

‘వకీల్ సాబ్‌’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక పరిస్థితుల కోణంలోంచి వచ్చిన ఈ ‘‘మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్’’ తెలుగు సినిమాలన్నీ నక్సలిజం తిరుగుబాటు వంటి కథావస్తువులనే హైలెట్ చేసాయి. ఆయా కాలాలలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను ఈ సినిమాలు కమర్షియల్‌గా లాభసాటిగా మలుచుకోగలిగాయి. అలా ‘ఒసేయ్ రాములమ్మ’, ‘ఎన్‌కౌంటర్’ వంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి.

‘ఎన్‌కౌంటర్’లో కృష్ణ (file/Photo)


మరోవైపు టాలీవుడ్ సినిమా మార్కెట్‌లో తెలంగాణ ఏరియాకు ఉన్న ‘బాక్సాఫీస్ కెపాసిటి’ కూడా ఇక్కడ గమనార్హం. సినీ డిస్ట్రిబ్యూషన్ పరిభాషలో తెలంగాణా అంతా నైజాం ఏరియాగా పిలుస్తారు. నిజాం పరిపాలించిన ప్రాంతం కాబట్టి నైజాంగా రూపొంతారం చెందింది.  ఈ నైజాం ఏరియా నుంచి వచ్చే ఆదాయం తెలుగు సినిమాల మొత్తం ఆదాయంలో దాదాపు 45 శాతం వరకూ ఉంటుంది.  ఈ మార్కెట్‌ని క్యాప్చర్ చేయడానికి కూడా అడపాదడపా తెలుగు మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు తెలంగాణా కథా వస్తువులతో సినిమాలను రూపొందించారు. ఇపుడు ఇక, అనివార్యంగా పూర్తి స్థాయి తెలంగాణ సినిమాలు మెయిన్‌స్ట్రీమ్ తరహాలో రావలసిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కొత్త కథా వస్తువులు, నటీనటులు, కొత్త చిత్రీకరణ విధానాలు, కొత్త ఆలోచనలు ప్రాథమిక స్థాయిలోనైనా రూపుదిద్దుకునే అవకాశం ఏర్పడుతున్నది. ఇక వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లలిల ‘విరాట పర్వం’ కూడా 90వ దశకం తెలంగాణ నక్సల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ నెల 17న ఈ సినిమా విడుదల కానుంది.

Virata Parvam theatre release date confirmed, Virataparvam On NetFlix, virata parvam news, Rana Daggubati Sai Pallavi venu udugula virata parvam to stream on netflix, Rana, Sai pallavi, Virata parvam shooting, Rana Daggubati health problems, Rana Daggubati Milind rau, Dheerudu,rana latest films, Rana Daggubati aranya , Rana Daggubati Shruti Haasan web series, sai pallavi,sai pallavi dance,sai pallavi movies,sai pallavi songs,sai pallavi husband,sai pallavi new movie,sai pallavi interview,సాయి పల్లవి కొత్త సినిమాలు,సాయి పల్లవి వార్తలు,సాయి పల్లవి న్యూ మూవీస్,విరాటపర్వం సినిమా, Virata Parvam trailer, Virata Parvam review
తెలంగాణ నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో ’విరాట పర్వం’ (Viraataparvam Photo : Twitter)


మరాఠీ - భోజ్‌పురి ఉదంతాలు
ఉత్తరాదిలోని దాదాపు 12 రాష్ట్రాలలో అధికార భాష, అత్యధిక ప్రజలు మాట్లాడే భాష- హిందీ. ఈ రాష్ట్రాలలో బాలీవుడ్ హిందీ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. అయినప్పటికీ మరాఠీ, భోజ్‌పురి సినిమాలు కూడా తమదైన అస్తిత్వం, కథలు, సంస్కృతితో సినీ రంగంలో దూసుకుపోతున్నాయి. అయితే ఇదంతా రాత్రికి రాత్రే జరిగింది కాదు. భోజ్‌పురిలో మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమా 1970 దశకంలో ఆరంభమయింది. మరాఠీలో భారతీయ తొలి సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ కాలం (1913) నుండే సినీ రంగం ఉంది కానీ బాలీవుడ్ సునామీ ముందు మరాఠీ సినీ రంగం నిలదొక్కుకోలేకపోయింది.

తొలి భారతీయ మరాఠీ సినిమా’రాజా హరిశ్చంద్ర’


కానీ గత 15 ఏళ్ళ నుంచీ మళ్లీ మరాఠీ సినీ రంగం ఊపందుకుంది. అవి కూడా కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ సాధిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది దర్శక, నిర్మాతలు హీరోలు తెలంగాణ కథా వస్తువులతో సినిమాల్లో భాగం చేయడం ఆహ్వానించ దగ్గ పరిణామం.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Telangana, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు