Home /News /movies /

TELANGANA MINISTER TALASANI SRINIVAS YADAV MET NAGARJUNA CHIRANJEEVI IN ANNAPURNA STUDIOS FOR INDUSTRY DEVELOPMENT PK

చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ విశేషాలు ఇవే..

చిరంజీవి నాగార్జునతో తలసాని భేటీ (talasani chiranjeevi nagarjuna)

చిరంజీవి నాగార్జునతో తలసాని భేటీ (talasani chiranjeevi nagarjuna)

జూబ్లీ హిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి, నాగార్జునలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాలను వీళ్ళతో చర్చించాడు మంత్రి.

జూబ్లీ హిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి, నాగార్జునలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాలను వీళ్ళతో చర్చించాడు మంత్రి. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై ఈ ముగ్గురు చర్చించినట్లు తెలుస్తుంది. వారం రోజుల కింద ఇదే విషయంపై చిరంజీవి ఇంట్లో కలిసారు తలసాని. ఇప్పుడు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో భేటీ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి విషయంపై ఇప్పటికే హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ, కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో కూడా మంత్రి తలసాని సమీక్షించారు.
చిరంజీవి నాగార్జునతో తలసాని భేటీ (talasani chiranjeevi nagarjuna)
చిరంజీవి నాగార్జునతో తలసాని భేటీ (talasani chiranjeevi nagarjuna)

దాంతో పాటు సినిమా ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను తలసాని ఆదేశించారు. ఇక కల్చరల్ సెంటర్, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు సేకరణ చేయాలని కూడా ఈ భేటీలో నిర్ణయించారు. దాంతో పాటు సినీ, టివి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చిత్రపురి కాలనీలోనే ఈ స్థలం ఉండబోతుంది.
చిరంజీవి నాగార్జునతో తలసాని భేటీ (talasani chiranjeevi nagarjuna)
చిరంజీవి నాగార్జునతో తలసాని భేటీ (talasani chiranjeevi nagarjuna)

సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు ఇప్పించేలా కూడా చర్యలు తీసుకోనున్నారు. FDC ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడతామని చిరు, నాగార్జునలకు మంత్రి తలసాని హామీ ఇచ్చారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తామని హీరోలకు తలసాని చెప్పినట్లు తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Talasani Srinivas Yadav, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు