త్రివిక్రమ్ హీరోయిన్‌తో తెలంగాణ మంత్రి పువ్వాడ బైక్‌పై చక్కర్లు..

Minister Puvvada Ajay: తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిజంగానే టాలీవుడ్ హీరోయిన్‌తో బైక్ ఎక్కి చక్కర్లు కొట్టారు. రోడ్డు ప్రమాదాలను నివారించే విధంగా చేపట్టిన కార్యక్రమంలో త్రివిక్రమ్ అరవింద సమేత హీరోయిన్ ఈషా రెబ్బాను బైక్ ఎక్కించుకున్నారు పువ్వాడ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 28, 2020, 7:30 PM IST
త్రివిక్రమ్ హీరోయిన్‌తో తెలంగాణ మంత్రి పువ్వాడ బైక్‌పై చక్కర్లు..
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌తో బైక్‌పై ఈషా రెబ్బా (TS minister puvvada ajay Eesha rebba)
  • Share this:
అవును.. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే టాలీవుడ్ హీరోయిన్‌ను బైక్‌పై ఎక్కించుకుని చక్కర్లు కొట్టాడు ఓ తెలంగాణ మంత్రి. అయితే అది సందేశం కోసమే. మరి త్రివిక్రమ్ హీరోయిన్ ఎవరు అనుకోవచ్చు.. ఆమె మరెవరో కాదు ఈషా రెబ్బా. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్ హీరోయిన్ అయిపోయింది. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది ఈ బ్యూటీ. దానికి ముందు ఇంద్రగంటి మోహనకృష్ణ బందిపోటు.. అమీ తుమీ లాంటి సినిమాల్లో మెరిసింది కానీ సరైన బ్రేక్ అయితే రాలేదు.

ఈషా రెబ్బా (Eesha Rebba)
ఈషా రెబ్బా (Eesha Rebba)


తెలుగమ్మాయి కావడంతో బేసిగ్గానే ఈమెను పట్టించుకోలేదు మన దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే తాజాగా ఈమె తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో బైక్ ఎక్కి చక్కర్లు కొట్టింది. ఈ వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే తిరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు పాటించాల్సిన భద్రతా నిబంధనల గురించి మంత్రి పువ్వాడ అందరికీ సూచించారు. ఇందులో భాగంగానే ఆయన ఓ రైడ్ కూడా చేసాడు.

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌తో బైక్‌పై ఈషా రెబ్బా (TS minister puvvada ajay Eesha rebba)
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌తో బైక్‌పై ఈషా రెబ్బా (TS minister puvvada ajay Eesha rebba)


రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలను జనవరి 28న నెక్లెస్‌ రోడ్డులోని హెచ్‌ఎండీఏ మైదానంలో ప్రారంభించారు. అక్కడికి హీరోయిన్ ఈషా రెబ్బా కూడా వచ్చింది. ఈ సందర్భంగానే మంత్రి పువ్వాడ హెల్మెట్‌ ధరించి బైక్ రైడ్ చేస్తుంటే వెనక సీట్‌లో కూర్చుంది ఈషా. ఈ ఇద్దరూ బైక్‌పై వెళ్తుండగా ఫోటోలు క్లిక్ అనిపించాయి. నిబంధనలను పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇక ఈషా రెబ్బా కూడా నియమాలు పాటించాలంటూ వాహన దారులకు విజ్ఞప్తి చేసింది.
Published by: Praveen Kumar Vadla
First published: January 28, 2020, 7:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading