సామజవరగమన పాటకు కేటీఆర్ ఫిదా... ఏమన్నారో తెలుసా ?

వాట్ ఏ బ్రిలియంట్ సాగ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. నా ప్లే లిస్ట్‌లో ఈ పాట చేరిపోయిందన్నారు.

news18-telugu
Updated: January 21, 2020, 10:39 AM IST
సామజవరగమన పాటకు కేటీఆర్ ఫిదా... ఏమన్నారో తెలుసా ?
కేటీఆర్
  • Share this:
సామజవరగమన ... ప్రస్తుతం సంగీత ప్రియుల్ని ఓ ఊపు ఊపుతున్న పాట. ఎవరి ఫోన్లో చూసినా... ఈ పాట తప్పక కనిపిస్తుంది. ఇక ఎక్కడకెళ్లిన సామజవరగమన ... సాంగ్ వినిపిస్తుంది. సినిమా రిలీజ్‌కు ముందే విడుదలైన ఈ సాంగ్... యూట్యూబ్‌ను షేక్ చేసింది. మిలియన్స్ వ్యూస్ తెచ్చి పెట్టింది. ఇప్పటికీ కూడా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ అల వైకుంఠపురంలో సినిమా పాటపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇప్పుడు తెల్లవారుజామున 3.30 గంటల అవుతుంది... ఇప్పుడు సామజవరగమన పాట నాకు కంపెనీ ఇస్తుందన్నారు కేటీఆర్. నా మైండ్ నుంచి ఈ పాట అసలు వెళ్లడం లేదంటూ పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. వాట్ ఏ బ్రిలియంట్ సాగ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. నా ప్లే లిస్ట్‌లో ఈ పాట చేరిపోయిందన్నారు. ఈ సాంగ్‌కు అద్భుతమైన మ్యూజిక్ అందించిన తమన్‌పై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న కేటీఆర్.... అక్కడ మంచు కురుస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ... సామజవరగమన సాంగ్‌పై ట్వీట్ చేశారు. ఇప్పటికే ఫుల్ జోష్‌లో ఉన్న అల వైకుంఠపురం సిినిమా టీమ్‌కు కేటీఆర్ ట్వీట్‌తో డబుల్ ఎనర్జీ వచ్చినట్లే.First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు