టాలీవుడ్ హీరోలకు కేటీఆర్ థ్యాంక్స్... కానీ పవన్ విషయంలో..

KTR: ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రభుత్వాలకు కూడా భారీగానే విరాళాలు అందచేసారు. దాంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 7:24 PM IST
టాలీవుడ్ హీరోలకు కేటీఆర్ థ్యాంక్స్... కానీ పవన్ విషయంలో..
కేటీఆర్, పవన్ కల్యాణ్(File)
  • Share this:
కరోనా వైరస్ కారణంగా వేలాది మంది బాధ పడుతున్నారు. ఎంతోమంది ఆకలితో అల్లాడిపోతున్నారు. దాంతో మన హీరోలు ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమ వంతు సాయంగా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలంతా తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. కొందరు హీరోలు కోట్లలో కూడా అందజేసారు. ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రభుత్వాలకు కూడా భారీగానే విరాళాలు అందచేసారు. దాంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతున్నాడు.


ట్విట్టర్‌లో అదే పనిమీద ఉన్నాడు ఈయన. ప్రతీ హీరో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిధులకు ఆర్థిక సాయం అందజేసారు.
ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి కోటి రూపాయలు.. జూనియర్ ఎన్టీఆర్ 75 లక్షలు.. రామ్ చరణ్ 70 లక్షలు.. నితిన్, త్రివిక్రమ్ 20 లక్షలు.. సాయి ధరమ్ తేజ్ 10 లక్షలు ఇలా చాలా మంది హీరోలు ఇరు రాష్ట్రాలకు అందించారు.


వాళ్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు కేటీఆర్. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఈయనెందుకు ఆలస్యం చేసాడు.


అందరికంటే ఎక్కువగా విరాళం అందించింది పవన్ కళ్యాణే. ఈయన ఏకంగా 2 కోట్ల రూపాయలు విరాళం అందించాడు. అందులో తెలంగాణ, ఆంధ్రాకు చెరో 50 లక్షలు.. ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు ఇచ్చాడు. గ్రేట్ గెస్చర్ అన్నా అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చాడు.

మొత్తానికి అందరికి త్వరగానే థ్యాంక్స్ చెప్పినా కూడా పవన్ విషయంలో మాత్రం కాస్త ఆలస్యం చేసాడు తెలంగాణ మంత్రి.
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు